ప్రధాని మోదీ కాన్వాయ్ కుదింపు
- సగానికి వాహనాలను తగ్గించిన పీఎం
- పొదుపు చర్యల్లో భాగంగా నిర్ణయం
- ఎలక్ట్రిక్ వాహనాలు పెంచాలని ఎస్పీజీకి సూచన
న్యూఢిల్లీ, మే 13: ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు, ఇంధన పరిరక్షణ దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా--ఇరాన్ యు ద్ధం కారణంగా పెరిగిన ముడి చమురు ధర లు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి కారణంగా ఏర్పడిన సంక్షోభం నేపథ్యంలో ప్రధాని మోదీ దేశం ప్రజలను పొదుపు పాటించాలని సూ చించారు. ఈ నేపథ్యంలో తాను కూడా పొదుపు చర్యలు చేపట్టారు. ముందుగా తన అధికారిక కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్య ను తగ్గించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ మేరకు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడంతో పాటు ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో ఇంధన వినియోగాన్ని పరిమితం చేయాలనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. తన భద్రతా బాధ్యతలు చూసే స్పెషల్ ప్రొ టెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ)ను ఉద్దేశించి, కాన్వాయ్‌లోఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను పెం చాలని, అయితే దీనికోసం కొత్త వాహనాలు కొనుగోలు చేయవద్దని మోదీ సూచించారు.
భద్రతా ప్రమాణాలైన ‘బ్లూ బుక్’ మార్గదర్శకాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఎస్పీజీ ఈ ఆదేశాలను అమలు చేయడం ప్రారంభించింది.ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయం స్ఫూర్తితో బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేఖా గుప్తా, భజన్ లాల్ శర్మ, మోహన్ యాదవ్ వంటి వారు కూడా తమ అధికారిక కాన్వాయ్‌ల్లో వాహనాల సంఖ్య ను తగ్గించుకోవాలని నిర్ణయించారు.
ఇది దేశవ్యాప్తంగా పరిపాలనలో పొదుపును ప్రోత్సహించే విస్తృత ప్రయత్నాలలో భాగంగా కనిపిస్తోంది. ప్రభుత్వ స్థాయిలో పొదుపు చర్యలు చేపడుతూనే, ప్రజలు కూడా బాధ్యతాయుతంగా ఉండాలని ప్రధాని మోదీ ఇటీవల పిలుపునివ్వడం గమనార్హం. కాగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా కూడా ప్రధాని మోదీ బాటలోనే పయనించనున్నారు. తన కాన్వాయ్‌ల్లో సగానికి సగం వాహనాలు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు.






