నిరుపేదల సొంతింటి కల సాకారం
ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి
దేవరకద్ర, మే 13: గ్రామీణ ప్రాంతంలోని నిరుపేదలకు ఇంద్రమ్మ ఇంటి ని ర్మాణంతోనే కళా సహకారం అవుతుందని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. బుధవారం దేవరకద్ర మండల పరిధిలోని అడివి ఆజిల్లాపూర్, చిన్న రాజమూర్, నార్లోని కుంట తదితర గ్రామాల్లో ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఇందిరమ్మ గృహాలను ప్రారం భించి ఇంటి యజమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఇంటి యాజమాన్యాలకు ఎమ్మెల్యే దుస్తులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పది సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన గత ప్రభుత్వం నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ లను నిర్మిస్తామని చెప్పి మండలంలో ఈ గ్రామంలో కూడా ఒక ఇంటిని కూడా నిర్మించలేదన్నారు దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు అందజేస్తామని చెప్పిన విధంగానే ఇంద్రమ్మ ఇంటిని అర్హులైన వారికి మంజూరు చేసి ఐదు లక్షల రూపాయలను దశలవారీగా అందజేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు.
నియోజకవర్గంలో మొదటి విడతగా 3500 ఇండ్లను మంజూరు చేయడం జరిగిందని ఆయా గ్రామాల్లో చివరి దశకు ఇండ్ల నిర్మాణాలు పూర్తి కావస్తున్నాయన్నారు రెండో విడత ఇందిరమ్మ ఇండ్లను ఈనెల చివరి వారంలో గ్రామాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లను అందజేస్తామన్నారు. రైతులను తప్పుదో పట్టించేందుకు టిఆర్‌ఎస్ నాయకులు వరి ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని తప్పుడు ప్రచారం చేస్తుందని రైతు యొక్క ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు.
రైతులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా కొనుగోలు కేంద్రంలోని ధాన్యమును విక్రయించాలన్నారు. కార్యక్రమంలో తాహసిల్దార్ ముహమ్మద్ హర్షద్, ఎంపీడీవో శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షుడు అంజల్ రెడ్డి,వివిధ గ్రామాల సర్పంచ్లు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






