14 May, 2026 | 3:54 AM

ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ చెట్ల పొదలు

14-05-2026 02:47 AM
  1. ముళ్ల పొదల్లో విద్యుత్ తీగలు 
  2. పట్టించుకోని అధికారులు 

భీమిని, మే 13 : భీమిని మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల పక్కన ఉన్న విద్యుత్ నియంత్రిక చుట్టు పిచ్చి మొక్కలు అల్లుకుపోయి అధ్వానంగా మారింది. ప్రధాన రహదారికి ఆనుకొని ఉండటంతో ప్రయాణికులకు ఇబ్బంది కరంగా మారింది. ఇక్కడే ప్రతి వారం వార సంత నిర్వహిస్తారు. ఈదురు గాలులు వచ్చినప్పుడు ట్రాన్స్ ఫార్మర్ నియంత్రిక వద్ద మంటలు చెలరేగుతున్నాయి. దీనితో అటుగా వెళ్లే పాదా చారులకు, సంత నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు.

అంతేకాకుండా నియంత్రిక వద్ద పశువులు సంచరిస్తున్నాయి. నియంత్రిక చుట్టూ ఏర్పాటు చేసిన కంచె ద్వారం తెరిచి ఉండడంతో ప్రమాదం జరిగే పరిస్థితి నెలకొందని ప్రజలు వాపోతున్నారు. ఈ నియంత్రికకు అమర్చి ఉన్న విద్యుత్ తీగలు తుమ్మ పొదలకు ఆనుకొని ఉండడంతో మంటలు చెలరేగుతున్నాయని గ్రామ స్తులు పేర్కొంటున్నారు.

ముఖ్యంగా గురువారం నిర్వహించే వారసంతలో చిల్లర వ్యాపార వర్ధకులు, పక్కన చికెన్ షాప్ ల వద్దకు వచ్చే ప్రజలు రహదారి పక్కనే నియంత్రిక ఉండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో ఏమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులు ట్రాన్స్ ఫార్మర్ వద్ద పిచ్చి మొక్కలను తొలగించి నియంత్రిక రక్షణకు ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు.