23 May, 2026 | 5:44 PM

తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం

23-05-2026 04:36 PM
  1. పెద్ది చిత్ర పదర్శనకు పర్సెంటేజ్ ఇవ్వాల్సిందే
  2. పర్సెంటేజ్ ఇస్తినే పెద్ది సినిమా ఆడిస్తాం
  3. 250 మంది ఎగ్జిబిటర్ల అందరిదీ ఒకటే మాట
  4. తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా ఎగ్జిబిటర్ శేఖర్ ఎన్నిక

హైదరాబాద్: తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్(Telangana Exhibitors Association) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ టాలీవుడు నటుడు రామ్ చరణ్ పెద్ది(Peddi) చిత్ర ప్రదర్శనకు పర్సెంటేజ్ ఇవ్వాల్సిందేనని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. పర్సెంటేజ్ ఇస్తేనే పెద్ది సినిమా ఆడిస్తామని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తేల్చిచెప్పింది. నిర్మాతలు కావాలనే జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. 250 మంది ఎగ్జిబిటర్ల అందరిదీ ఒకటే మాట అని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ వెల్లడించింది. తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా ఎగ్జిబిటర్ శేఖర్ ఎన్నికయ్యారు.

పెద్ది సినిమాను టార్గెట్ చేయలేదు: తెలంగాణ ఎగ్జిబిటర్లు 

Peddi సినిమాని టార్గెట్ చేయలేదని తెలంగాణ ఎగ్జిబిటర్లు వెల్లడించారు. పెద్ది లాంటి సినిమాలు ఇండస్ట్రీకి అవసరం అని పేర్కొన్నారు. ఆ సినిమాపై తమకు ఎలాంటి పగ లేదు అంటూ తెలంగాణ ఎగ్జిబిటర్లు క్లారిటీ ఇచ్చారు. మొదట పెద్ది చిత్రాన్ని ఈ వివాదం నుంచి బయట పెట్టాలని భావించామన్న ఎగ్జిబిటర్లు తర్వాత తమ సమస్యలపై ఎవరు స్పందిస్తారో తెలియక.. పర్సంటేజ్ స్లాబ్‌లో చేర్చాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎగ్జిబిటర్లు వ్యాఖ్యలు ఫిలింనగర్ లో హాట్ టాపిక్‌గా మారాయి.