23 May, 2026 | 6:36 PM

Breaking News

కష్టపడే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది   •   ఎమ్మెల్యే మున్సిపాలిటీ లో ఎక్స్ టెన్షన్ కౌంటర్ గా మార్చారు   •   చట్టాలపైన అవగాహన లేకనే కేసుల్లో ఇరుక్కుపోతున్నారు   •   ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం   •   చోరీ కేసులో నిందితుడు అరెస్ట్.. బంగారం, వెండి వస్తువుల స్వాధీనం   •   పేరు మార్పిడి చేసిన రెవెన్యూ ఉద్యోగిని సస్పెండ్ చేయాలి   •   జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఛైర్మెన్ గా దూమల రాజ్ కుమార్   •   తాడువాయిలో జీలుగ విత్తనాల పంపిణీ   •   రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులుగా గడ్డం రాజశేఖర్ నియామకం   •   నందివాడలో ఉపాధి పనుల పరిశీలన   •  

ఆదర్శ కుటుంబంలోకి..

23-05-2026 12:00 AM

విక్టరీ వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తొలిసారి ‘ఆదర్శ కుటుంబం’ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. వెంకీ మామ ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లేశ్వరి’, ‘వాసు’ లాం టి సినిమాలకు త్రివిక్రమ్ మాటలు రాశారు. అప్పట్నుంచే ఈ మాటల మాంత్రికుడి దర్శకత్వంలో వెంకటేశ్ నటించాలన్న కోరికను అభిమానులు వ్యక్తం చేస్తూ వచ్చారు. ఫ్యాన్స్ కోరిక దశాబ్దాల తర్వాత ‘ఆదర్శ కుటుంబం’ రూపంలో తీరబోతోంది.

ఇప్పటికే కీలక భాగం షూటింగ్ పూర్తి చేసుకుందీ ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్‌టైనర్. ఇందులో శ్రీనిధి శెట్టి మెయిన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే, ఈ ప్రాజెక్టులోకి మరో అందం  చేరింది. ఇందులోని ఒక ప్రాధాన్యం ఉన్న పాత్ర కోసం నివేత పేతురాజ్‌ను ఎంపిక చేసుకుందట టీమ్. నివేత ఇంతకుముందు ‘అల వైకుంఠపురములో’నూ నటించింది.

ఆ చిత్రంలో అల్లు అర్జున్ మరదలిగా అలరించిన ఈ భామ్య ఇటీవల తెరపై ఎక్కువగా కనిపించిందే లేదు. దీంతో తాజా అవకాశం నివేతకు మంచి బ్రేక్ ఇచ్చేలా ఉంది. ఈ సినిమాలో నివేత ఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తుంద ని సమాచారం. ఈ మూవీ అక్టోబర్‌లో విడుదలయ్యే ఛాన్స్ ఉంది.