ఆకట్టుకునే అంశాలతో సందిగ్ధం
24-05-2026 01:37 AM
తీర్థ క్రియేషన్స్ బ్యానర్‌పై సంధ్య తిరువీధుల నిర్మాణంలో పార్థసారథి కొమ్మోజు దర్శకత్వంలో ‘సందిగ్ధం’ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో నిహాల్, ప్రియా దేశ్ పాగ్, అర్జున్ సీహెచ్, కాజల్ తివారి మెయిన్ లీడ్‌రోల్స్‌లో నటించగా, విలన్ రోల్‌లో ‘తెర చేప’ ఫేమ్ నవీన్ సంకరపు నటించారు. ఈ మూవీని మే 29న రిలీజ్ చేయబోతోన్నారు.
ఈ క్రమంలో శనివారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో దర్శకుడు పార్ధసారథి మాట్లాడుతూ.. “సందిగ్ధం’ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది” అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిహాల్, కాజల్ తివారి, అర్జున్, సంగీత దర్శకుడు గౌతమ్ రవిరామ్ తోపాటు పలువు రు చిత్రబృందం కూడా మాట్లా డారు.






