ప్రజలంతా ఆయురారోగ్యాలతో జీవించాలి
30-07-2026 01:08 AM
ఎమ్మెల్యే నవీన్ యాదవ్
జూబ్లీహిల్స్,జూలై 29(విజయక్రాంతి):దైవాశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో జీవించాలని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆకాంక్షించారు. ఏజీ కాలనీ డివిజనులోని జీటీఎస్ ఆలయంలో బుధవారం జరిగిన గురు పౌర్ణమి వేడుకలకు ఆయన ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు.ఆలయంలో ప్రత్యేక పూజలను జరిపించి తీర్థప్రసాదాలు,వేదాశీర్వచనాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలంతా సుఃఖశాంతులతో జీవించాలని కోరుకున్నారు.
దైవానుగ్రహంతో నియోజకవర్గం అభివృద్ధి పథంలో పరుగులు పెట్టాలన్నారు. ప్రతి ఏడాది వ్యాసపూర్ణిమను గురు పూర్ణిమగా జరుపుకుంటామన్నారు.జీవితంలో గురువుల పాత్ర ఎనలేనిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.






