రూ.3,24234 కోట్లతో తెలంగాణ బడ్జెట్
20-03-2026 12:35 PM
లక్ష్యసాధనలో అడ్డంకులెదురైనా ముందుకెళ్తున్నాం
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసనసభలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy Chief Minister Bhatti Vikramarka) 2026-27 ఏడాదికి బడ్జెట్(Telangana Budget 2026-27) ప్రవేశపెడుతున్నారు. ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక న్యాయం అందించడమే తమ లక్ష్యమని భట్టి విక్రమార్క అన్నారు. అంబేద్కర్ అడుగుజాడల్లోనే పాలన సాగిస్తున్నామని తెలిపారు. ప్రజాసంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామన్నారు. లక్ష్యసాధనలో అడ్డంకులు ఎదురైన ముందుకెళ్తున్నామని సూచించారు.
రూ. 3,24,234 కోట్లతో రాష్ట్ర బడ్జెట్
రెవెన్యూ వ్యయం రూ. 2,34,406 కోట్లు
మూలధన వ్యయం రూ. 47,267 కోట్లు




