డీసీసీ జిల్లా ఉపాధ్యక్షులుగా గుడిపల్లి రాంచందర్ రెడ్డి
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో జిల్లా కార్యవర్గాన్ని పూర్తిగా ఏర్పాటు చేసినట్లు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు జారీ చేశారు.దాంట్లో భాగంగా కామారెడ్డి జిల్లా డిసిసి ఉపాధ్యక్షులుగా(DCC District Vice President) నాగిరెడ్డిపేట మండలంలోని వదలపర్తి గ్రామానికి చెందిన గుడిపల్లి రామచంద్రారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
కామారెడ్డి జిల్లా డిసిసి ఉపాధ్యక్షులుగా నియమితులుగా సహకరించినందుకు గుడిపల్లి రామచంద్రారెడ్డి రెడ్డి జిల్లా డిసిసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ మరియు ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావులకు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు.డిసిసి జిల్లా ఉపాధ్యక్షులుగా గుడిపల్లి రామచంద్రారెడ్డి ఎన్నికైన సందర్భంగా మండలంలోని పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున అభినందనలు తెలియజేశారు.





