13 March, 2026 | 10:00 PM

ఎస్‌ఎస్‌సీ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన తహసీల్దార్

13-03-2026 03:20 PM

పెంచికల్పేట (విజయక్రాంతి): మార్చి 14 నుంచి ప్రారంభమయ్యే ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో  తహసీల్దార్ జె. తిరుపతి శుక్రవారం జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా చీఫ్ సూపరింటెండెంట్‌కు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రంలో సరిపడా ఫర్నిచర్, తాగునీటి సదుపాయం, నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా సిబ్బంది జాగ్రత్తగా విధులు నిర్వహించాలని తెలిపారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు పరీక్షా కేంద్రం పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144 ఉత్తర్వులు అమల్లో ఉన్నట్లు తెలిపారు.