13 March, 2026 | 7:36 PM

పదో తరగతి తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం

13-03-2026 03:23 PM

14 మార్చి 2026 నుంచి 16 ఏప్రిల్ 2026 వరకు.

ఎంఈఓ పరిటాల వెంకటరమణ  ప్రకటన.

చర్ల, (విజయక్రాంతి):  చర్ల మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు చెందిన 10వ తరగతి పరీక్షలు(Tenth Class Public Exams ) ఈనెల  14  మార్చి 2026 నుంచి, 16 ఏప్రిల్ 2026 వరకు జరగనున్నాయని  ఎంఈఓ పరిటాల వెంకటరమణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిథి లో  నిర్వహించనున్న పదో  తరగతి పరీక్షలకు సర్వం సిద్దం చేసి నట్లు  .మండలంలో మొత్తం 311 మంది విద్యార్థులు పరీక్ష రాయనుండగా చర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 228 , సత్యనారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 83 మంది వ్రాయనున్నారు .

ఇద్దరు చీప్ సూపర్నిడెంట్స్ ,ఇద్దరు డిపార్ట్మెంట్స్ ఆఫీసర్స్ ,3 కస్టోడియన్స్ తో పాటు 19 మంది ఇన్విజిలేటర్స్ ని పరీక్షల నిర్వహణకు జిల్లా  విద్యాశాఖ నియమించిందని ప్రకటించారు . పరీక్ష కేంద్రాలలో త్రాగు నీటితో పాటు ,ఆరోగ్య  కార్యకర్తలను నియమించి అన్నీ వసతులు  కల్పించినట్లు తెలిపారు .సిసి కెమెరాల పర్యవేక్షణలో ఈ పరీక్షలు జరగనున్నాయి . ప్రశాంత వాతావరణం లో పరీక్షలు జరిగేందుకు  పోలీస్ వారి సహకారం తీసుకొంటున్నామని , పరీక్ష కేంద్రాల వద్ద ఇతర వ్యక్తులు సంచరించ రాదనీ ,పరీక్షా సమయం లో  జీరాక్స్ కేంద్రాలు  మూసి ఉంచాలని సూచించారు .