16-02-2026 12:51:17 PM
వైస్ చైర్మన్‌గా బాదం రమేష్ నియామకం.
నాగర్ కర్నూల్, (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ మున్సిపల్ చైర్మన్‌గా 23వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీగల సునీంద్రను, 8వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాదం రమేష్ ను వైస్ చైర్మన్‌గా నియమిస్తూ ఎన్నికల అధికారి ఆర్డీఓ సురేష్ కుమార్ ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున బి ఫామ్ జారీ చేయగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆర్డీఓ సురేష్ ప్రకటించారు. అంతకుముందు 24 వార్డుల నూతన కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. పార్టీ నిర్ణయంతో స్థానిక రాజకీయాల్లో ఉత్కంఠకు తెరపడింది. నూతన చైర్మన్, వైస్ చైర్మన్‌లు పట్టణ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని తెలిపారు.