6 July, 2026 | 4:28 AM

బాసర మహాకార్యానికి శ్రీకారం

06-07-2026 02:00 AM
  1. ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభం 
  2. 31 కోట్ల విరాళం అందించిన హైదరాబాద్ దంపతులు 
  3. బాలాలయంలో అమ్మవారి దర్శనం 

నిర్మల్, జూలై 5 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని జ్ఞాన సరస్వతి బాసర అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఆలయ పునర్నిర్మాణానికి హైదరాబాద్‌కు చెందిన పద్మప్రియ, సునంద్ దంపతులు రూ.31 కోట్లు విరాళం అందజేశారు. వారితో కలిసి ముధోల్ ఎమ్మె ల్యే పవార్ రామారావు పటేల్ ఆలయ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ప్రభు త్వం ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్ల కేటాయించగా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల మాస్టర్ ప్లాన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే.

కాగా ఉత్సవ విగ్రహాలను బాల మందిరానికి తరలించి పూజల అనంతరం ప్రతిష్ఠించారు. భక్తులకు సర్వదర్శనం కల్పించారు. సరస్వతి అమ్మవారు బాలాలయంలోనే ఇకనుంచి భక్తులకు ఇక దర్శనం ఇవ్వనున్నారు. బాసర ఆలయ పున్ననిర్మాణ పనులు వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే రామారావు పటేల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో అంజనీదేవి తదితరులు పాల్గొన్నారు.