సూర్యాస్త్ర ప్రయోగం సక్సెస్
రెండు వేరియంట్ల పరీక్షలు విజయవంతం
కొనేందుకు ఆసక్తిచూపుతున్న భారతసైన్యం
భువనేశ్వర్, మే 20: భారత స్వదేశీ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసే దిశగా భారత్ కీలకముందడుగు వేసింది. ప్రైవేట్ రంగ రక్షణ సంస్థ నిబే లిమిటెడ్ సూదూర రాకెట్ వ్యవస్థ ‘సూర్యాస్త్ర’ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఒడిశాలోని చాందీపూర్ టెస్టింగ్ రేంజ్ నుంచి ఈ పరీక్షను చేపట్టింది.
150 నుంచి 300 కి.మీ. దూరంలోని లక్ష్యాలపై దాడిచేయగల రెండు రకాల సూర్యాస్త్ర రాకెట్ వేరియంట్లను పరీక్షించింది. 1.5 మీటర్ల నుంచి 2 మీటర్ల కచ్చితత్వంతో లక్ష్యాన్ని చేధించినట్లు అధికారులు వెల్లడించారు. దీన్ని కొను గోలు చేయడానికి భారతసైన్యం ముందుకు వచ్చినట్లు తెలుస్తుంది. సూర్యాస్త్ర సుదూర గైడెడ్ రాకెట్ ఫిరంగి వ్యవస్థ. శత్రు భూభాగంలోని స్థావరాలు, కమాండ్ సెంటర్లు, రాడార్ కేంద్రాలు లాజిస్టిక్స్ హబ్‌లపై కచ్చితమైన దాడులు చేయడానికి దీన్ని రూపొందించారు.
సంప్రదాయ ఫిరంగి గుండలా కాకుండా ఈ డీప్ స్ట్రుక్ గైడెడ్ రాకెట్లు అధునాతర నావిగేషన్ నియంత్రణ వ్యవస్థ సాయంతో సుదూర ప్రాంతాల్లోని లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదిస్తా యి. త్వరలోనే సూర్యాస్త్ర భారత అమ్ములపొదిలోకి చేరనుంది. భారత రక్షణ వ్యవస్థ, ఇజ్రాయెల్ సహకారంతో పూణేకు చెందిన నిబే లిమిటెడ్‌తో రూ. 293 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. సూర్యాస్త్రను నిబే, ఇజ్రాయెల్‌కు చెందిన ఎల్బిట్ సిస్టమ్‌తో కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేశారు.






