22 May, 2026 | 1:34 AM

27 మంది మావోయిస్టుల లొంగుబాటు

22-05-2026 12:00 AM

రాంచి, మే 21 : ఝార్ఖండ్ రాష్ట్రంలో గురువారం మొత్తం 27 మంది నక్సలైట్లు డీజీపీ తదాషా మిస్త్రీ సమక్షంలో లొంగిపోయారు. ఝార్ఖండ్ పోలీసు సీనియర్ అధికారుల ఎదుట ఆయుధాలతో లొంగిపోయినట్లు అధికారులు తెలిపారు. ఇది ఝార్ఖండ్ చరిత్రలోనే రికార్డు. వీరిలో చాలా మంది మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ నవజీవన్‌కు ప్రభావితమై వీరు జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లు వెల్లడించారు.

2026లో రాష్ట్రంలో 22 మంది మావోయిస్టులను మట్టుబెట్టగా.. 44 మం దిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. 29 మం ది లొంగిపోయారన్నారు. మిగిలిన వారు జనవీవన స్రవంతిలోకి చేరినట్లు పేర్కొన్నారు. గురువారం లొంగిపోయిన వారిలో మావోయిస్టు పార్టీ చివరి యాక్టివ్ పొలిట్ బ్యూరో సభ్యుడు మిశ్ బస్త్ర అలియాస్ సాగర్‌జీ కూడా ఉండే అవకాశం ఉందని తొలుత మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

ఇప్పటివరకు అధికారుల నుంచి వెలువడిన ప్ర కటనలో ఆయన పేరు ప్రస్తావన లేదు. తా జాగా లొంగిపోయిన వారిలో ఆయన సన్నిహిత బృందంలోని టాప్ కమాండర్లు, స్పెష ల్ జోనల్ కమిటీ సభ్యులు, ఏరియా కమిటీ సభ్యలు ఉన్నట్లు సమాచారం.