వాంఖడేలో సన్ రైజింగ్
తప్పక గెలవాల్సిన మ్యాచ్... రికెల్టన్ సెంచరీ చేశాడు..ఇంకేముంది 243 పరుగుల భారీ స్కోరు.. పర్లేదు గెలుస్తాం అనే ధీమా...కానీ ముంబై ధీమాను పటాపంచలు చేస్తూ సన్ రైజర్స్ బ్యాటర్లు రెచ్చిపోయారు. దొరికిన బాల్ ను దొరికినట్టుగా బాదేశారు. ముందు అభిషేక్ శర్మ, హెడ్... తర్వాత క్లాసెన్ , అరోరా విధ్వంసకర బ్యాటింగ్‌తో సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ టార్గెట్‌ను ఊదేసింది.
- దంచికొట్టిన ఎస్ ఆర్ హెచ్ బ్యాటర్లు
- 244 టార్గెట్ ను ఊదేసిన హైదరాబాద్
- రెచ్చిపోయిన హెడ్, క్లాసెన్
- రికెల్టన్ సెంచరీ వృథా
ముంబై , ఏప్రిల్ 29 : రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్ గాయాలతో దూరం కావడంతో ముంబై ఇండియన్స్ కొత్త జోడీని ఓపెనర్లుగా పంపింది. ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న విల్ జాక్స్తో పా టు ర్యాన్ రికల్టన్ను ఓపెనింగ్ పంపించింది. ఈ ప్రయోగం ముంబైకి సత్ఫలితాన్ని ఇ చ్చింది. వీరిద్దరూ తొలి వికె ట్కు 43 బంతుల్లో 93 పరుగులు జోడించారు. 22 బంతుల్లో 46 రన్స చేసిన తర్వాత జాక్స్.. తొలి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. మిగతా బ్యాటర్లు స్వల్ప స్కో రుకే పెవిలియన్ చేరుతు న్నా..
కల్టన్ మాత్రం ధాటి గా బ్యాటింగ్ చేశాడు.44 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. దీంతో ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ కొ ట్టాడు. సూర్యకుమార్ యా దవ్ (5) మరోసారి సింగిల్ డిజిట్కే ఔట్ అయ్యాడు. చివరి వరకూ క్రీజులో ఉన్న రికల్టన్.. ముంబైకి భారీ స్కోరు అందించాడు. ముంబై ఈ మ్యాచ్లో 243/5 స్కోరు నమోదు చేసింది. ఇందులో సగాని కంటే ఎక్కువ రన్స్ రికల్టన్ బ్యాట్ నుంచి వచ్చినవే. అతడు 55 బంతుల్లో 123 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు.
ఈ క్రమంలో 18 ఏళ్ల రికార్డ్ను ర్యాన్ రికెల్టన్ బద్దలు కొట్టాడు. ఐపీఎల్ 2008 సీజన్లో సనత్ జయసూర్య ముంబై ఇండియన్స్ తరఫున చెన్నై సూపర్ కింగ్స్పై 114 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ తరఫున ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్గా ఉండగా.. తాజా ఇన్నింగ్స్తో ర్యాన్రికెల్టన్ అధిగమించాడు.సన్రైజర్స్ బౌలర్లలో ప్రఫుల్ హింగే 2 వికెట్లు తీయగా, ఈషన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, నితీశ్ కుమార్ రెడ్డి ఒక్కో వికెట్ తీశారు.
ఐపీఎల్ చరిత్రలోనే ముంబై ఇండియన్స్కు ఇది మూడో అత్యధిక స్కోర్. ఫస్ట్ ఇన్నింగ్స్లో మాత్రం ఇదే అత్యధిక స్కోర్. చేజింగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు రెచ్చిపోయారు. భారీ టార్గెట్ ను కొన్ని బాల్స్ మిగిలి ఉండగానే ఫినిష్ చేయాలన్న లక్ష్యంతోనే బ్యాటింగ్ చేసినట్టు కనిపించింది. అభిషేక్ శర్మ,,హెడ్ పవర్ ప్లేలో దంచి కొట్టారు. తొలి వికెట్ కు 8.4 ఓవర్లలోనే 129 పరుగులు జోడించారు. అయితే ఐదు పరుగుల తేడాలో 3 వికెట్లు కోల్పోవడంతో సన్ రైజర్స్ వెనుకబడినట్టు కనిపిం చింది.క్లాసెన్ 65 నాటౌట్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. చివరలో సలీల్ అరోరా మెరుపు బ్యాటింగ్ చేశాడు. మూడు సిక్సర్లు బాదాడు. 10 బంతుల్లోనే 30 పరుగులు చేశాడు. ఇక, ఈ సీజన్ లో హైదరాబాద్‌కు ఇది వరుసగా 5వ విజ యం.. దీంతో 244 రన్స్ టార్గెట్ ను హైదరాబాద్ మరో 8 బంతులు మిగిలి ఉండగా నే చేజ్ చేసింది. 6 వికెట్ల తేడాతో ముంబైని చిత్తు చేసింది.
స్కోర్ బోర్డు
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ : 243/4 ( రికెల్టన్ 123 , హార్దిక్ 33 ; ప్రఫుల్ 2/54)
సన్ రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ : 249/4 ( హెడ్ 76, క్లాసెన్ 60, అభిషేక్ శర్మ 45






