30 April, 2026 | 3:01 PM

ఏపీ టెన్త్‌ ఫలితాలు విడుదల.. బాలికలదే హవా

30-04-2026 12:06 PM

అమరావతి: ఆంధ్రప్రదేశ్ SSC పబ్లిక్ పరీక్షల ఫలితాలు(AP SSC Results 2026) అధికారికంగా విడుదలయ్యాయి. విద్యార్థుల మొత్తం పనితీరులో మెరుగుదల కనిపించిందని మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) ప్రకటించారు. గత ఏడాది 81.14శాతంగా ఉన్న ఉత్తీర్ణత శాతం, ఈసారి 85.25 శాతానికి పెరిగిందని లోకేష్ తెలిపారుఏపీ పదోతరగతి ఫలితాల్లో బాలుర ఉత్తీర్ణత శాతం 82.68శాతం ఉండగా, బాలికలు 87.90శాతం ఉత్తీర్ణత సాధించారు. 2026 ఏపీ పది ఫలితాల్లో బాలికలదేపైయి. 

ప్రభుత్వ పాఠశాలలు కూడా గణనీయమైన పురోగతిని కనబరుస్తూ, 72.8శాతం నుండి 78.39 శాతానికి తమ ఫలితాలను మెరుగుపరుచుకున్నాయి. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక పోర్టల్, DigiLocker, LEAP మొబైల్ అప్లికేషన్, Mana Mitra WhatsApp సేవ ద్వారా, అలాగే తమ సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుల లాగిన్‌ల ద్వారా కూడా పొందవచ్చు. AP Open School SSC, Intermediate పరీక్షల ఫలితాలు కూడా విడుదలయ్యాయి. ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో నిలకడగా వస్తున్న మెరుగుదల తనకు అపారమైన సంతృప్తిని ఇస్తోందన్న మంత్రి లోకేష్ ఉత్తీర్ణులైన విద్యార్థులను అభినందించారు.

SSC పబ్లిక్ పరీక్షల ఫలితాలు కోసం లింక్ పై క్లిక్ చేయండి. 

https://results.bse.ap.gov.in