11 May, 2026 | 1:27 PM

Breaking News

మొగిలిపేట క్లస్టర్ గ్రామాల్లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అవగాహన కార్యక్రమం   •   ​తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి   •   పంటకోతకు యంత్రాల కొరత.. ఇబ్బందులు పడుతున్న రైతన్న   •   బంగారం కొనుగోళ్లపై దేశప్రజలకు హెచ్చరించిన ప్రధాని మోదీ   •   చంబాలో లోయలో పడిన కారు: ఆరుగురు గుజరాత్‌ పర్యాటకులు మృతి   •   మేడ్చల్‌లో విషాదం: కౌకూర్ చెరువులో అన్నదమ్ముల మృతదేహాలు లభ్యం   •   అమ్మ ఒడి కార్యక్రమంలో గర్భిణీలకు వైద్య పరీక్షలు   •   ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు   •   కాఠ్మండు విమానాశ్రయంలో కలకలం—టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో మంటలు   •   యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •  

విద్యార్థి ఉత్తమ ప్రతిభ

17-02-2026 06:09 PM

కడెం,(విజయక్రాంతి): కడెం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి ఎస్వి ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థి ఉత్తమ ప్రతిభను కనబరిచారు. ఈ నెల 7, 8, 9 తేదీలలో జరిగిన జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో కడెం మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్ గ్రామంలో గల తెలంగాణ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలకు చెందిన ఇంటర్మీడియట్ ఫస్టియర్ విద్యార్థిని ఎస్ బ్లెస్సినా ఉత్తమ ప్రతిభ కనబరచి బంగారు పతకం సాధించడం జరిగిందని గురుకుల పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్ శకుంతల పీఈటీ దుర్గం సునితలు తెలిపారు. ఈ సందర్భంగా బంగారు పతకం సాధించిన బ్లేస్సినకు ప్రిన్సిపాల్ శకుంతల నచ్చన్ ఎల్లాపూర్ గ్రామ సర్పంచ్ బొడ్డు రాజేశ్వరి స్పందన గంగన్న ఉప సర్పంచ్ జాడి లక్ష్మీ ఆనంద్ జిపి వార్డు సభ్యులు పిఈటి సునీత పాఠశాల కళాశాల ఉపాధ్యాయులు అధ్యాపకులు పోషకులు అభినందించారు.