21 March, 2026 | 1:41 PM

Breaking News

జీవన్ రెడ్డికి బుజ్జగింపులు.. తన నిర్ణయంలో మార్పులేదన్న సీనియర్ నేత   •   తస్మాత్ జాగ్రత్త.. సమోసా, పఫ్స్ ప్రియులకు షాకింగ్ సీన్   •   రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం, డిప్యూటీ సీఎం   •   'శ్రమ మాది.. శిలాఫలకాలు మీవి'.. రిబ్బన్ కటింగ్ చేయడమే కాంగ్రెస్ పని   •   వేరే వ్యక్తిని పెండ్లి చేసుకుందని.. తండ్రితో వెళ్లి మహిళపై ప్రియుడు దాడి   •   యువకుడి ప్రాణం తీసిన పెళ్లి ప్రపోజల్‌.. పండగ పూట తీవ్ర విషాదం   •   కరీంనగర్ టూటౌన్ ఎస్ఐ ఆత్మహత్య.. అనాథలుగా మారిన చిన్నారులు   •   మార్కెట్‌లోకి 14 కోట్ల బ్యారళ్ల ఇరాన్ చమురు.. అమెరికా ఆంక్షలు ఎత్తివేత   •   హార్ముజ్ జలసంధి గురించి మాకు అవసరం లేదు.. వారికి ధైర్యం లేదు   •   కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధిగా బండారి గంగాధర్   •  

నిందితులకు కఠిన శిక్షలు విధించాలి

19-03-2026 12:00 AM

పెంచికల్‌పేట్, మార్చి 18(విజయ క్రాంతి): మండలంలోని కొండపల్లి గ్రామం లో ఇటీవల హత్యకు గురైన ఆదివాసి యువతి ఆత్రం సమ్మక్క కుటుంబాన్ని సిపిఎం, తెలంగాణ ఆదివాసి గిరిజన సం ఘం  నాయకులు పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని వారు భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి కూషన రాజన్న, సిర్పూర్ నియోజకవర్గ కన్వీనర్ ముంజం ఆనంద్ కుమార్,

టాగ్స్ జిల్లా కార్యదర్శి నెర్పల్లి అశోక్, జిల్లా ఉపాధ్యక్షులు కోట శ్రీనివాస్ తదితరులు కుటుంబ సభ్యులను కలిసి హత్యకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. నాయకులు మాట్లాడుతూ జిల్లా లో ఇటీవలి కాలంలో ఆదివాసీలపై, ముఖ్యంగా మహిళలపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆత్రం సమ్మక్కను ప్రేమ పేరుతో మోసం చేసి హత్య చేసిన నిందితుడు జలపతి ,అతని కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.