19 May, 2026 | 2:48 AM

గోవుల అక్రమ రవాణాను ఆపండి

19-05-2026 01:40 AM

డీజీపీకి ఎమ్మెల్యే రాజాసింగ్ బహిరంగ లేఖ

హైదరాబాద్, మే 18 (విజయక్రాంతి): తెలంగాణలో గోవులను అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రాజాసింగ్ డీజీపీకి సోమవారం బహిరంగ లేఖ రాశారు. శనివారం రాత్రి గోవులతో వెళ్తున్న లారీని గోరక్ష దళ్ కార్యకర్తలు అడ్డుకున్నార ని, దీంతో ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ అక్కడికి చేరుకొని ఆ లారీని తీసుకెళ్లడం ఎంతవరకు సరైందని పేర్కొన్నారు.

చట్టం అందరి కీ ఒకేలా ఉండాలని, హిందువైనా, ఎం ఐఎం నాయకులైనా ఒకే విధంగా చూడాలని లేఖలో కోరారు. గోవుల అక్రమ రవాణా చేస్తూ బహిరంగంగా తిరుగుతున్న వారిపై వెంటనే కేసులు పెట్టాలని కోరారు. పోలీసులు రాజకీయ ఒత్తిడికి లోనుకాకుండా పనిచేయాలని, గోమాతను కాపాడాలని చెప్పే ప్రభుత్వం, అక్రమ రవాణాను ఎందుకు ఆపడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. జీపీ స్పందించి చర్యలు తీసుకోవాలని రాజాసింగ్ కోరారు.