15 May, 2026 | 1:46 AM

బసవతారకంలో అత్యాధునిక పాథాలజీ వ్యవస్థ

15-05-2026 12:41 AM

ప్రారంభించిన నందమూరి బాలకృష్ణ

బంజారాహిల్స్, మే 14(విజయక్రాంతి): బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చి ఇన్సిస్టిట్యూట్‌లో 240 స్లైడ్ స్కానర్‌తో కూడిన డిజిటల్ పాథాలజీ వ్యవస్థను రోగులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఐసీఐసీఐ ఫౌండేషన్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థను సంస్థ చైర్మన్ బాలకృష్ణ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఆసుపత్రి స్థాపించిన నాటి నుంచి ఎప్పటికపుడు అందుబాటులోకి వచ్చిన ఎన్నో ఆధునిక వైద్య వ్యవస్థలను అందుబాటులోనికి తీసుకొని రావడానికి కృషి చేస్తున్నామన్నారు.

ఇందుకోసం ఎంద రో దాతలు, రెండు రాష్ట్రాల ప్రభుత్వా లు, కేంద్ర ప్రభుత్వం, పారిశ్రామిక వేత్త లు, ప్రవాస భారతీయులు ముందుకు వచ్చి నిధులు అందించి సహకారం అం దించారని వివరించారు. ఈ కోవలోనే ఐసీఐసీఐ ఫౌండేషన్ మరో ఆధునిక వ్యవస్థను రోగులకు అందించడానికి ముందుకు రావడం సంతోషకరమైన విషయమన్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ల్యాబోరేటరీ అండ్ పాథాలజీ విభాగం హెడ్ డాక్టర్ సుశీల కోదండపాణి మాట్లాడుతూ ఈ వ్యవస్థ ద్వారా పలు రక్తపరీక్షలు, కణజాల పరీక్షలను నిర్వహించిన తర్వాత అందుకు వినియోగించిన స్లైడ్‌లను స్కానర్ ద్వారా స్కాన్ చేసి డిజిటల్ రూ పంలోకి మార్చి వైద్యులందరికీ అందుబాటులోనికి తీసుకొనివస్తామని ఆమె తెలిపారు.

సుమారు 80 రెట్లు జూమ్ చేసి చూసుకోగలిగే స్థాయిలో స్కాన్ చే సిన ఇమేజ్‌లను వైద్యులు అత్యంత నిశితంగా, సూక్ష్మంగానూ పరిశీలించి అ త్యంత ఖచ్చితత్వంతో త్వరిత గతిన వ్యాధి నిర్థారణ చేయగలగడం ఈ విధా నం విశిష్టతగా పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బవసతారకం ట్రస్టు బోర్డు స భ్యులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, జె యస్‌ఆర్ ప్రసాద్, మెడికల్ డైరెక్టర్ టి యస్ రావు, మెడికల్ సూపరింటిండెం ట్ డాక్టర్ ఫణి కోటేశ్వరరావు, అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ కల్పనా రఘునాథ్, ల్యాబోరేటరీ మెడిసిన్, పాథాలజీ విభాగాలకు చెందిన వైద్యులు, పారా మెడిక ల్ సిబ్బంది, టెక్నిషీయన్లు, హాస్పిటల్ సిబ్బందితో పాటు ఐసీఐసీఐ ఫౌండేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.