15 May, 2026 | 3:05 AM

సిస్కోలో భారీగా ఉద్యోగాల కోత

15-05-2026 12:37 AM

4 వేల మంది ఉద్యోగుల తొలగింపు 

మెటా, అమెజాన్, ఒరాకిల్ వంటి కంపెనీల సరసన సిస్కో

అదే బాటలో లింక్డిన్, వాల్‌మార్ట్ కంపెనీలు కూడా..

వాషింగ్‌టన్, మే 14: అమెరికన్ టెక్ సంస్థ సిస్కో దాదాపు 4,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ‘ఏఐ యుగంలో’ విజయం సాధించాలంటే కంపెనీ కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి న అవసరం ఉందని సిస్కో సీఈఓ చక్ రాబి న్స్ ఒక అంతర్గత మెమోలో రాశారు. సిస్కో తన ప్రపంచవ్యాప్త ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని యోచిస్తోంది. బుధవారం, సిస్కో సీఈఓ చక్ రాబిన్స్ ఉద్యోగులకు ఒక మెమో పంపారు, అందులో కంపెనీ దాదా పు 4,000 ఉద్యోగాలను తొలగించబోతోందని వివరించారు.

దీంతో, మెటా, అమెజాన్, ఒరాకిల్ వంటి కంపెనీల సరసన, తన ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్న తాజా టెక్ కంపెనీగా సిస్కో నిలిచింది. ఆ మెమోలో, రాబిన్స్ సిస్కో క్యూ3లో 15.8 బిలియన్ల ‘రికార్డు ఆదాయాన్ని’ సాధించిందని, ఇది గతేడాదితో పోలిస్తే 12 శాతం అధి కమని పేర్కొన్నారు. అయితే, ‘ఏఐ యుగం లో’ కంపెనీ విజయం సాధించాలంటే, ‘మ నం ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, మన వ్యవస్థ ఎలా ఉండాలి,  మన వ్యయ నిర్మాణం మన ముందున్న అవకాశాన్ని ఎలా ప్రతిబింబించాలి’ అనే విషయాలపై ‘కఠినమైన నిర్ణయా లు’ తీసుకోవలసి ఉంటుందని సిస్కో అధిపతి పేర్కొన్నారు. ఇది మొత్తం సిబ్బందిలో ఐదు శాతం కంటే తక్కువని కంపెనీ పేర్కొంది.

దీర్ఘకాలిక వృద్ధికి సంబంధించిన రంగాల వైపు పెట్టుబడులను మళ్లించే ప్రయత్నంలో భాగంగానే ఈ మార్పులు ఉన్నాయని సీఈ వో చక్ రాబిన్స్ తెలిపారు. కాగా మైక్రోసాఫ్ట్ నేతృత్వంలోని లింక్డిన్‌కూడా ఉద్యోగులను తొలగించనుంది. మొత్తం ఉద్యోగుల్లో ఐదు శాతం సుమారు 875 మందిని తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా సంస్థాగతంగా నిలదొక్కుకునేందుకు మార్పులు అమలుచేశామని ఈ అమెరికా సంస్థ ప్రతినిధి మీడియాకు తెలిపారు. మరోవైపు వాల్‌మార్ట్ కూడా వెయ్యి మంది ఉద్యోగులకు స్వస్తి పలకటమో.. లేక వేరే విభాగాలను బదిలీ చేయనుంది. ఈ విషయాన్ని అమెరికాకుచెందిన ప్రముఖ సంస్థ వాల్‌మార్ట్ వెల్లడించింది. గ్లోబల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొడక్ట్ బృందాలను విలీనం చేయనుంది.