మాదాపూర్‌లో సిమ్స్ హాస్పిటల్స్ ప్రారంభం
హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి): మాదాపూర్‌లో అత్యాధునిక 100 పడకల మల్టీ స్పెషాలిటీ సిమ్స్ హాస్పిటల్స్‌ను గురువారం మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ మిశ్రా, డాక్టర్ బి. లక్ష్మీకాంతం (రిటైర్డ్ ఐఏఎస్), సత్తార్ ఉమాపతి (రిటైర్డ్ ఇన్స్పెక్టర్ జనరల్), హాజరైన జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి, పీవీ రావు (రిటైర్డ్ ఐఆర్‌ఎస్, ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్), టీవీఎం రావు (రిటైర్డ్ ఐఎఫ్‌ఎస్) ప్రారంభించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. ప్రజలకు విశ్వసనీయమైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడమే సిమ్స్ హాస్పిటల్స్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పేద, మధ్యతరగతి ప్రజలకు కూ డా అందుబాటులో ఉండే విధంగా అత్యాధునిక వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయ డం అభినందనీయమని పేర్కొన్నారు. ఆసుపత్రిలో ఆధునిక వైద్య మౌలిక వసతులు, అత్యాధునిక సాంకేతిక పరికరాలు, మూడు మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, ప్రత్యేక క్రిటికల్ కేర్ సౌకర్యాలు, 24 గంటల అత్యవసర, అంబులెన్స్ సేవలు, వెంటిలేటర్, ఆధునిక పేషెంట్ మానిటరింగ్ సిస్టమ్స్ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
అనుభవ జ్ఞు లైన వైద్యులు, శస్త్రచికిత్స నిపుణులు, నర్సులు, వైద్య సిబ్బంది రోగులకు నిరంతరం సేవలు అందించనున్నారని పేర్కొన్నారు. మెడికల్ డైరెక్టర్ డా. శ్రీనివాస్ జె మాట్లాడుతూ.. ఆసుపత్రిలో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, డయాబెటిస్ చికిత్స, క్రిటికల్ కేర్ మెడిసిన్, అనస్థీషియా, పెరియోపరేటివ్ కేర్, ఎమర్జెన్సీ, ట్రామా కేర్, న్యూరోసర్జరీ, బేరియాట్రిక్ సర్జరీ, ప్రాక్టాలజీ, ప్రసూతి, గైనకాలజీ, ఫెర్టిలిటీ సేవలు, ఆధునిక డయా గ్నస్టిక్ మరియు ఇమేజింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఎగ్జిక్యూ టివ్ డైరెక్టర్ ఎస్. కుర్మా రావు మాట్లాడుతూ.. ప్రాంత ప్రజలకు మరింత చేరువగా ప్రపంచ స్థాయి వైద్య సేవలను కరుణ, భద్రత మరియు నాణ్యతతో అందించడమే తమ లక్ష్యమని తెలిపారు.






