6 July, 2026 | 4:50 AM

అత్యవసర వైద్య సేవల్లో నైపుణ్యతను పెంపొందించుకోవాలి

06-07-2026 01:46 AM

ఆర్వీఎం వైద్య కళాశాలలో రాష్ట్రస్థాయి ‘టీమ్స్2026’ సదస్సు

పాల్గొన్న దేశ, విదేశాల అత్యవసర వైద్య నిపుణులు 

గజ్వేల్, జూలై 5: అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన, నాణ్యమైన వైద్య సేవలతో ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు నిరంతరం ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకో వాలని నిపుణులు సూచించారు. సిద్దిపేట జి ల్లా ములుగు మండలం లక్ష్మక్క పల్లి ఆర్వీ ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్లో అసోసియేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఎడ్యుకేటర్స్ సహకారంతో నిర్వహిస్తున్న ‘టీమ్స్2026( తెలంగాణ ఎమర్జెన్సీ ఎక్యూట్ కేర్ సమ్మిట్ ) రాష్ట్రస్థాయి సదస్సులో ఈ విషయాలను వెల్లడించారు.

తెలంగాణలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ రెండు రోజుల సదస్సును నిజాంస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) డీన్ డాక్టర్ పి. చంద్రశేఖర్ ప్రారంభించారు. ఆర్వీ ఎం వైద్య కళాశాల చైర్మన్ డాక్టర్ యాకయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల నుంచి ప్రముఖ అత్యవసర వైద్య నిపుణులు హాజరయ్యారు. సీఎంసీ వేలూరు, కిమ్స్, నిమ్స్, అపోలో, ఎయిమ్స్ బీబీనగర్, యూకేలోని రాయల్ డెర్బీ హాస్పిటల్కు చెందిన ఎమర్జెన్సీ మెడిసిన్ నిపుణులు సదస్సులో పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. రాష్ట్రంలోని వివిధ వైద్య కళాశాలల్లో ఎమర్జెన్సీ మెడిసిన్లో పీజీ చదువుతున్న విద్యార్థులకు ఆధునిక అత్యవసర చికిత్సా విధానాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.

గుండెపోటు, గర్భిణుల అత్యవసర పరిస్థితులు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు తొలి గంటలో అందించాల్సిన చికిత్స, రోగులకు మనోధైర్యం కల్పించే విధానాలు, ప్రాణాపాయ పరిస్థితుల్లో వేగవంతమైన వైద్య నిర్వహణ వంటి అంశాలపై నిపుణులు ప్రదర్శనలు, నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్వీఎం డైరెక్టర్లు డాక్టర్ గోపీకృష్ణ, డా క్టర్ నర్సయ్య, ఎయిమ్స్ బీబీనగర్ డీన్ డాక్టర్ అభిషేక్ అరోరా, యూకే రాయల్ డెర్బీ హాస్పిటల్ కన్సల్టెంట్ డాక్టర్ వెంకట్ కోటంరాజు, నిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా క్టర్ ఆశిమా శర్మతో పాటు పలువురు వైద్యు లు, అధ్యాపకులు, పీజీ విద్యార్థులు పాల్గొన్నారు.