రహ‘దారి’ద్య్రం..
వంతెన నిర్మించారు.. తారు మరిచారు
నిత్యం అవస్థలు పడుతున్న ప్రయాణికులు
త్వరితగతిన తారు రోడ్డు వేసి సమస్య తీర్చాలంటున్న వాహనాదారులు
పాపన్నపేట, జులై5: మెదక్- బొడుమటిపల్లి ప్రధాన రహదారి గుండా నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ మార్గం మధ్యలో ఉన్న కొత్తపల్లి గ్రామ శివారులోని వాగు పైనున్న వంతెన శిథిలావస్థకు చేరడంతో 2022వ సంవత్సరంలో రూ.2.35 కోట్ల వ్యయంతో ప్రభుత్వం కొత్త వంతెనను నిర్మించింది. వంతెన నిర్మిం చి సుమారు నాలుగు సంవత్సరాలు కావస్తున్నా వంతెనకు ఇరువైపులా అనుసంధాన రోడ్డును నిర్మించకుండా మట్టి పోసి వదిలేశారు.
దీంతో నిత్యం వాహనాలు వెళుతున్నప్పుడు దారిపై దుమ్ము, మట్టి పైకి లేస్తూ వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో వర్షం కురిస్తే మట్టి కొట్టుకుపోవడంతో పా టు పెద్ద, పెద్ద గుంతలు ఏర్పడుతున్నాయి. ఆ గుంతల్లో వాహనాలు పాడవడమే కా కుండా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ప డుతున్నారు. వాన నీరు నిలిచి వాహనాలు వచ్చి వెళ్ళినప్పుడు గుంతలు మరింత లోతై వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది. గుంతల్లో నీరు నీలిచి బురద మయంగా మారుతున్నాయి.
త్వరలో పూర్తి చేస్తాం.
వంతెన శిథిలావస్థకు చేరడంతో రూ.2.35 కోట్ల నిధులతో నూతన వంతెన నిర్మించారు. వంతెనకు ఇరువైపులా తారు రోడ్డు సైతం త్వరలో పూర్తి చేస్తాం. హ్యంలో నిధులు కేటాయించారు. త్వర లో పనులు ప్రారంభించి పూర్తి చేస్తాం.
వెంకటేశం, డీఈ, ర. భ. శాఖ
త్వరితగతిన తారు వేసి సమస్య తీర్చాలి.
వంతెన నిర్మించి 4 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ వంతెనకు ఇరువైపులా తారు రోడ్డు నిర్మించకపోవడంతో రోజు అవస్థలు పడుతున్నాం. తారు రోడ్డు త్వరగా పూర్తి చేసి ప్రయాణికులు, వాహనదారుల ఇబ్బందులు తీర్చాలి.
శ్రావణ్,పాపన్నపేట






