15 July, 2026 | 12:22 AM

ఇంకెన్నాళ్లు.. కరెంటు కష్టాలు..!

15-07-2026 12:22 AM
  1. మండుతున్న ఎండలు..ఎండుతున్న చేలు
  2. రైతుకు 24 గంటల కరెంటు ఉత్తిమాటేనా ?

జహీరాబాద్, జూలై 14 :కరెంటు ఎప్పు డు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం మాత్రం రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తు న్నామని ప్రగల్బాలు పలుకుతున్నారే తప్ప అది అమలులో కనపడటం లేదు. ప్రతిరోజు కరెంటు పోవడానికి, రావడానికి టైం టేబు ల్ అంటూ ఏదీ లేదు. ప్రస్తుత వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నప్పటికీ వర్షాలు కురియకపోవడంతో పంటలు ఎం డుముఖం పట్టాయి. ఎండలు దంచి కొడుతున్నాయి. రైతులు బోరు బావుల ద్వారా నీటిని పారించాలన్నా కరెంటు సక్రమంగా రాకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు.

జహీరాబాద్ ప్రాంతంలో చెరుకు పంట ప్రధానమైనది కావడంతో ఈ పంటకు నీటిని వదలాలంటే కరెంటు సక్రమంగా రాకపోవడంతో కరెంటు మోటర్లు, ట్రాన్స్ఫారాలు కాలిపోతున్నాయి. సరఫరా అయ్యే కరెంటు సక్రమంగా వదలకపోవడంతో ఈ పరిస్థితి దాపురించింది. రైతులకు ఇచ్చే కరెంటు లో వోల్టేజ్ తో రావడంతో బోరు మోటారు సక్రమంగా నడవక వేడెక్కి కాలిపోతున్నాయి. కాలిన మోటార్లను రిపేరు చేయించడానికి ప్రతి రైతుకు పదివేల వరకు ఖర్చు అవుతుంది. 

ఉచిత కరెంట్ ఉత్తిమాటేనా ?

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉచిత కరెంట్ అంటూ ఊకదంపుడు మాటలు చెప్తున్నారు తప్ప రైతులకు సక్రమంగా కరెంటు అందించడంలో విఫలమవుతున్నారు. విద్యుత్ అధికారులు మాత్రం ప్రభుత్వం ద్వారా సక్రమంగా కరెంటు సరఫరా కావడంలేదని ఇది అంతా ఒక పాలసీ ప్రకారమే విద్యుత్తు అందిస్తున్నామంటూ విద్యుత్ అధికారులు బహిరంగంగానే చెబుతున్నారు. ప్రతిరోజు సాయంత్రం 4.20 నిమిషాలకు కరెంటు తీసేయడంతో పంటలకు నీళ్లు పెట్టలేకపోతున్నారు.

అర్ధరాత్రి రెండు గంటల తర్వాత విద్యుత్ సరఫరా చేయడంతో నీటిని పంటలకు అందించేందుకు రైతులు అనేక కష్టనష్టాలు ఎదు ర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతిరోజు త్రీఫేస్ కరెంట్ ఉదయం నుండి సాయంత్రం వరకు అనేకసార్లు కరెంటు తీసివేస్తున్నారు. కరెంటు తీసివేయడంతో రైతు లు సక్రమంగా నీటిని పారించలేక పోతున్నారు. దీంతో చెరుకు పంటలతో పాటు ఇతర పంటలు కూడా ఎండు దశలోకి చేరుకుంటున్నాయి.

వానదేవుడు కరుణించకపో వడంతో వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నప్పటికీ వర్షం పడకపోవడంతో పంటలు వేసిన రైతులు కరెంటు మీద ఆధారపడకుండా ఆకాశం వైపు చూస్తున్నారు. వానదేవుడు ఎప్పుడు కనికరిస్తాడో నని ప్రతిరోజు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధు లు, అధికారులు, ప్రభుత్వం చొరవ తీసుకొని రైతులకు నాణ్యమైన కరెంటు ఇవ్వాలని కోరుతున్నారు.