14 July, 2026 | 9:32 PM

ఆత్మకూరు గ్రామంలో ఎస్‌ఐఆర్ పనులు తనిఖీ చేసిన ఎంపీడీవో

14-07-2026 09:03 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని పెద్ద ఆత్మకూర్ గ్రామంలో ఎస్.ఐ.ఆర్ పనులను  ఎంపీడీవో గంగాధర్  ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఎంపీడీవో గంగాధర్ పెద్ద ఆత్మకూరు గ్రామంలో జరుగుతున్న ఎస్‌ఐఆర్ పనుల గురించి సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు సలహాలు తెలియజేశారు.అనంతరం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థుల హాజరు రిజిస్టర్ బోధన విధానం, మౌలిక సదుపాయాలు,పాఠశాల పరిశుభ్రతను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు.గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు,ప్రభుత్వ పథకాల అమలుపై కూడా ఎంపీడీవో గంగాధర్ ఆరాధిస్తారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శులు రవీందర్,స్రవంతి, ఉపాధ్యాయులు గ్రామస్తులు ఉన్నారు.