18 April, 2026 | 6:00 AM

మంచాల చంద్రమౌళికి ‘దళిత రత్న‘ అవార్డు

18-04-2026 01:18 AM

భీమదేవరపల్లి ఏప్రిల్ 17 (విజయక్రాంతి) హైదరాబాద్  రవీంద్ర భారతిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన మహనీయుల జయంతి సందర్భంగా సామాజిక న్యాయం కోసం పోరాడిన ప్రముఖులకు  ‘దళిత రత్న‘ అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా భీమదేవరపల్లి మండలం వంగర  మాల మహానాడు జిల్లా కార్యదర్శి మంచాల చంద్రమౌళి కి  ప్రతిష్టాత్మక ‘దళిత రత్న‘ అవార్డు పురస్కారం లభించింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎమ్మార్పీ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి మాట్ల వెంకటస్వామి, మాదిగ వంగర గ్రామ మాజీ సర్పంచ్ కండ రమేష్, అంబేద్కర్ సంఘం వంగర గ్రామ అధ్యక్షులు ఎనిమిదో వార్డ్ నెంబర్ గజ్జల సురేష్, కండే చక్రపాణి, రోడ్ల వీరస్వామి రోడ్డ సంపత్, గిద్ద శ్రీనివాస్, కండే సంజీవ్, మహేశ రాజు, పరకాల నరసయ్య, గ్రానైట్ తిరుపతి, మాట్ల శ్రీనివాస్, గజ్జల వెంకటస్వామి, మంచాల శ్రీనివాస్, సొల్లు పరుష రాములు, దొంత కనకయ్య ,మ్యాదరి సదానందం, బైరం రవీందర్, గజ్జల, రవీందర్ లు పాల్గొన్నారు.