మహిళా బిల్లులో దివ్యాంగ మహిళలకు సబ్ కోటా కల్పించాలి
వీజీఆర్ నారగోని
ముషీరాబాద్, జూలై 14 (విజయక్రాంతి): ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లులో దివ్యాంగులు బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ డిమాండ్ చేసింది. సబ్ కోటా కోసం ఉభయ తెలుగు రాష్ట్రాలలో ’మహిళా పిలుపు’ పేరిట మహిళలను చైతన్యవంతం చేస్తామని, అన్ని పార్టీల, సంఘాల మద్దతు తీసుకుని ’చలో పార్లమెంట్’ పేరిట ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం చేపడుతామని ఫ్రంట్ వెల్లడించింది.
ఈ మేరకు మంగళవారం ఎన్‌ఎస్‌ఎస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ జేఏసీ వైస్ చైర్మన్, రాజ్యాధికార పార్టీ వ్యవస్థావకుడు విజిఆర్. నారగోని, ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కె.బి. శ్రీధర్, దివ్యాంగ జన్ జాతీయ అధ్యక్షురాలు డా. ఉదయలక్ష్మి తదితరులు మాట్లాడుతూ అన్ని వర్గాల మహిళలందరికీ మహిళా బిల్లులో సబ్ కోటా కల్పించినప్పుడే దేశం అభివృద్ధి చెం దుతుందన్నారు. 2029లో నుంచి జరిగే ప్రతి ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.






