calender_icon.png 8 February, 2026 | 3:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథనిలో శ్రీనుబాబు ప్రచారం జోరు

08-02-2026 12:07:41 PM

కాంగ్రెస్ పార్టీతో నే అభివృద్ధి సాధ్యం

మంథని పట్టణాన్ని మోడల్ సిటీగా మార్చేందుకు కృషి

మంథనిలో మున్సిపల్ ఎన్నికల సుడిగాలి ప్రచారం లో  టిపిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు

మంథని,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీతో నే అభివృద్ధి సాధ్యమని, ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని, మంథనిలో మున్సిపల్ ఎన్నికల సుడిగాలి ప్రచారంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు ప్రజలను కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మంథని పట్టణంలోని 13 వార్డులలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం శ్రీనుబాబు సుడిగాలి పర్యటన చేశారు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ప్రతివార్డులో తిరుగుతూ చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.

శ్రీనుబాబు పర్యటన మంథనిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చింది. శ్రీధర్ బాబు ఇంటింట తిరుగుతుంటే ప్రజలు బ్రహ్మరథం పట్టారు. చేతి గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపిస్తామని శ్రీను బాబుకు మంథని పట్టణ ప్రజలు హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో 13 వార్డులకు గాను 13 మంది కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపిస్తే మంథని పట్టణాన్ని మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో మోడల్ సిటీగా తీర్చిదిద్దుతామని ప్రజలకు హామీ ఇచ్చారు.