అద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ఇందిరమ్మ ఇండ్లు
13-05-2026 12:26 AM
- గృహప్రవేశానికి రావడం ఎంతో ఆనందం ఇస్తుంది
- నగర డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి
హన్వాడ మే 12 : ఇందిరమ్మ ఇండ్లు అద్భుతంగా రూపుదిద్దుకుంటున్నాయని నగర డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని దాచేపల్లి గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారదర్శకంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిన ప్రజాపాలన ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల్ ప్రెసిడెంట్ మహేందర్ జిల్లా డీసీసీ జనరల్ సెక్రటరీ వెంకటయ్య, గ్రామ సర్పంచ్ శ్రీలత కృష్ణ, ఉప సర్పంచ్ శంకర్ నాయక్, శశికల, నాగ్య నాయక్, రాజు నాయక్,తదితరులు పాల్గొన్నారు.






