వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు
12-05-2026 08:29 PM
జవహర్ నగర్,(విజయక్రాంతి): 40ఏళ్ళుగా నివాసం ఉంటున్న ఇంటిని కొందరు కబ్జా చేయాడానికి యత్నిస్తున్నారని, వారిని శిక్షించి నాకు న్యాయం చేయాలని వృద్ధురాలు దనమ్మ అధికారులను వేడుకోంది. ఈ మేరకు కాప్రా తహసీల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం వృద్ధురాలు నిరసన తెలిపింది. ఈ సందర్భంగా దానమ్మ మాట్లాడుతూ పలుకుబడి ఉన్నోళ్ళు నా ఇంటిని ఆక్రమించుకోవాలని చూస్తున్నారని, ఇంటి పట్టా సర్టిఫికేట్లు నా వద్దే ఉన్నాయని, అధికారులు పట్టించుకొని కబ్జాచేర నుంచి కాపాడాలని అన్నారు. కబ్జాదారులపై జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యిందని తెలిపారు. ప్రభుత్వ అధికారులు న్యాయం చేస్తారని ఆశీస్తున్నానని పేర్కొంది.






