13 May, 2026 | 1:18 AM

ఇంకెన్నాళ్లు ఈ గోస

13-05-2026 12:22 AM
  1. మహనీయుల విగ్రహల కోసమే రోడ్డు వేస్తలేరా?
  2. హాట్ టాపిక్ గా జడ్చర్ల సిగ్నల్ గడ్డ 
  3. నెలల తరబడి ఇబ్బందులు పడుతున్న జనం 
  4. నెలలోనే చేస్తానన్న ఎమ్మెల్యే హామీ ఉట్టిదేనా!
  5. త్వరగా పూర్తి చేయాలని ప్రయాణికుల విజ్ఞప్తి

జడ్చర్ల, మే 12 : ఎక్కడో మారుమూల ప్రాంతంలో రోడ్డు ఆగింది అంటే అధికారుల పర్యవేక్షణ సరిగా ఉండదు నాయకుల రాకపోకలు అటువైపు చూడకపోవచ్చు అనే సందేహాలు ఉంటాయి. కాగా ఇక్కడ అది కాదు ప్రతిరోజు జిల్లా నే కాదు ఇతర జిల్లాల అధికారులతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు సైతం ఈ ప్రాంతం మీదుగా ప్రయాణాలు కొనసాగిస్తూ ఉంటారు. ఆ ప్రాంతమే జడ్చర్ల సిగ్నల్ గడ్డ. రోడ్డు విస్తరణ ప్రారంభించినప్పటి నుంచి ఇక్కడ ఉన్న డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించి ఆ తర్వాత ఏర్పాటు చేస్తామని చేపిన నేషనల్ హైవే అథారిటీ అధికారులు అటువైపు చూడటమే మానేశారు. దీంతో సంబంధిత అధికార యంత్రాంగం తో పాటు ఈ పని పూర్తి చేసినందుకు నిర్లక్ష్యానికి కారణమైన వారందరి పై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తుండ్రు. 

దుమ్ము, ధూళి, ప్రమాదాలకు నిలయం సిగ్నల్ గడ్డ 

 జడ్చర్ల పట్టణంతోపాటు నాగర్ కర్నూల్,బిజినపల్లి, వనపర్తి జిల్లాలతో పాటు శ్రీశైలం పుణ్యక్షేత్రానికి సైతం ఈ రోడ్డు మార్గముగా అత్యధికంగా వాహనాలు వెళుతుంటాయి. నెలల తరబడి ఈ రోడ్డు పూర్తి చేయకుండా ఉండడంతో దుమ్ము ధూళితో ప్రమాదాలకు సిగ్నల్ గడ్డ కేంద్రంగా మారింది. పట్టణానికి వెన్నుముకగా ఉన్న ఈ ప్రాంతం అపరిశుభ్రంగా కంకర తేలి దుమ్ము ధూళితో ఉండడంతో జనం నరకయాతన అనుభవిస్తున్నారు. అక్కడే ఎమ్మార్వో కార్యాలయం తో పాటు జడ్చర్ల పట్టణానికి ప్రధాన కేంద్ర బిందువుగా ఉన్న సిగ్నల్ గడ్డ ప్రాంతంలో రోడ్డు నిర్మాణం పూర్తి చేయకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపుగా రెండు సంవత్సరాల పైగానే ఈ ప్రాంతంలో రోడ్డు వేసేందుకు మరమ్మతులు చేపట్టినప్పటికీ నేటికీ పూర్తి కాకపోవడంతో జనం అసహనం వ్యక్తం చేస్తుండ్రు.

- నెలలోని పూర్తి చేస్తానన్న ఎమ్మెల్యే..

 తాను అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం నెల రోజులలోనే ఈ రోడ్డును పూర్తి చేస్తానని చెప్పిన ప్రస్తుత ఎమ్మెల్యే అటువైపు అస్సలు చూడటం లేదని జనం చెబుతున్నామాట. నిత్యం జనం ఇబ్బంది పడుతున్న పరిష్కరించాల్సిన సమస్యను పరిష్కార రూపం దాల్చకుండా కాలయాపన చేయడం ద్వారా ఈ ప్రాంతం నిత్యం ట్రాఫిక్ తో ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించి సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జనం కోరుతున్నారు. ఈ రోడ్డు నిర్మాణంను అత్యవసర పనిగా భావించి వెంటనే పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు వేడుకుంటుండ్రు.

జనాన్ని ఇబ్బంది పెడితే ఏమొస్తది

పట్టణంలో ప్రధాన సమస్యగా సిగ్నల్ గడ్డ మారింది. రోడ్డు నిర్మాణం చేపడితే ఏండ్ల తరబడి చేపడుతారా ఇది ఎక్కడి విధానం. చెబుతున్న పనులకు చేస్తున్న పనులకు అస్సలు సంబంధం లేకుండా ఉంది. వెంటనే సిగ్నల్ గడ్డ దగ్గర రోడ్డు నిర్మాణం పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఇంకా నిర్లక్ష్యం చేస్తే రోడ్డు కోసం ప్రజలు రోడ్డెక్కే పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా స్పందించి వెంటనే రోడ్డు నిర్మాణం పూర్తి చేసి ప్రజల రాకపోకలు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా వుంది.

          విజయ్, జడ్చర్ల