13 May, 2026 | 1:13 AM

ఐటీఐలో అడ్మిషన్లు షురూ

13-05-2026 12:00 AM

మహబూబాబాద్, మే 12 (వి జయక్రాంతి): ఐ.టి. ఐ/ ఎ.టి.సి ల ల్లో ప్రవేశం కోసం విద్యార్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు మహబూ బాబాద్ ప్రభుత్వ ఐటిఐ ప్రిన్సిపల్ ఓంకార్ తెలిపారు. తెలంగాణ ఉపాధి మరియు శిక్షణ శాఖ ఆద్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ ఐ.టి.ఐ/ ఎ.టి.సి. లలో మొదటి దఫా ప్రవేశాల కొరకు నోటిఫికేషన్ జారీ చేసినారని ఆగస్ట్ 2026 సెషన్ కోసం ఎన్ సీ వీ టీ క్రింద వివిధ ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ ట్రేడ్స్ లలో శిక్షణ పొందేందుకు అర్హులైన విద్యార్థుల నుండి  https://iti.telangana.gov.in వ్బుసైట్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

14 సంవత్సరాలు నిండి పదవ తరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలని, ఆన్లైన్లో దరఖాస్తు తో పాటు 100 రూపాయల రుసు ము చెల్లించవలసి ఉంటుందని, దరఖాస్తు చేసేటప్పుడు సంబంధిత కాపీలన్నింటిని స్కాన్ చేసుకొని కావాల్సిన ఐటిఐ/ ఏటీసీలలో ఉన్న కోర్సులను ఎంపిక చేసుకోవాలని కావున మహబూబాబాద్ జిల్లా ఐ.టి.ఐ లలో ఉన్న ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, డిజిల్ మెకానిక్, అదేవిధంగా ఎ.టి.సి లో ఉన్న సి.ఎన్.సి మేషినింగ్ టేక్నిషియన్, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికిల్, ఇంజనీరింగ్ డిజైన్ టేక్నిషియన్, వర్చువల్ అనాలసిస్ డిజైన్ తదితర కోర్సులలో ప్రవే శాలకు  జిల్లాలో ఉన్న విద్యార్థిని విద్యార్థులందరూ 14-5-2026 నుండి 8-6-2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.