హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
12-05-2026 08:32 PM
ఆళ్ళపల్లి,(విజయక్రాంతి): హనుమాన్ జయంతిని పురస్కరించుకుని మండల కేంద్రంలో ని హనుమాన్ విగ్రహం వద్ద హనుమాన్ సేన యూత్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఈ వేడుకలకు విచ్చేసిన భక్తులకు మహాన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు గౌరిశెట్టి నాగభూషణరావు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని వివిధ గ్రామాల నుండి భక్తులు తండోపతండాలుగా పాల్గొన్నారు. ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటులో హనుమాన్ సేన ఆర్థిక సహకారంతో నిర్వహించడం జరిగిందని కమిటీ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా హనుమాన్ జయంతి సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అలాగే భక్తులకు పానకం మజ్జిగ ప్యాకెట్లు అందించడం జరుగుతుంది తెలిపారు.






