12 May, 2026 | 9:35 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి

12-05-2026 08:27 PM

టీ స్టాళ్లను ఆకస్మికంగా తనఖీ చేసిన ఎస్ఐ చంద్రకుమార్

సుల్తానాబాద్,(విజయ క్రాంతి): టీ షాపులలో సిగరెట్లు తాగడానికి ప్రత్యేకంగా గదులను కేటాయించవద్దని ఎస్సై చంద్రకుమార్ టి షాపుల యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం రాత్రి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలో పలు టీ షాపులలో  స్మోకింగ్ జోన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. యువత చెడు మార్గాలకు దారి తీసే విధంగా సిగరెట్లు పీలుస్తున్నారని తద్వారా యువత ఆరోగ్యం చెడిపోతుందని మత్తుకు బానిసలై చెడు మార్గాలకు దారి తీసే విధంగా ఉన్నటువంటి  స్మోకింగ్ రూమ్ లను ఎత్తివేయాలని ఆదేశించారు.

ఇకనుండి తరచూ దాడులు నిర్వహిస్తామని ఎట్టి పరిస్థితుల్లో సపరేట్ గదులు ఏర్పాటు చేసి సిగరెట్లు విక్రయిస్తే ఉపేక్షించేది లేదని చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామనిహెచ్చరించారు. అనంతరం సిగరెట్లు పీల్చుతున్న యువతకు కౌన్సెలింగ్ నిర్వహించారు. యువత చక్కగా చదువుకొని బంగారు భవిష్యత్తుకు బాటలు వెయ్యాలే తప్ప ఇలాంటి సిగరెట్ , మత్తు పదార్థాలు ఇతర వ్యసనాలకు బానిసలు కావద్దని సూచించారు. ఈ తనిఖీలలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.