13 May, 2026 | 1:36 AM

ఘనంగా నాయిని జయంతి వేడుకలు

13-05-2026 12:27 AM

ముషీరాబాద్, మే12 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, తెలంగాణ రాష్ట్ర తొలి హోంమంత్రి,  కార్మికశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి  జయంతి సందర్భంగా గాంధీనగర్ డివిజన్‌లోని జవహర్ స్కూల్ వద్ద డివిజన్ నాయకులు పున్న సత్యనారాయణ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్, భారత రాష్ట్ర సమితి రాష్ట్ర యువ నాయకులు 

జై సింహ, గాంధీనగర్ డివిజన్ అధ్యక్షులు ముడారపు రాకేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి పోతుల శ్రీకాంత్, ముఠా నరేష్, ముచ్చకుర్తి ప్రభాకర్, ఎర్రం శ్రీనివాస గుప్త, పాశం రవి, షేక్ జహంగీర్, బోనం బన్నీ, జి. వెంకటేష్, ఎస్టీ ప్రేమ్, అజయ్‌బాబు, బి. కిరణ్‌కుమార్, రవిశంకర్ గుప్త, క్యాత శ్రీనివాస్, పాండునాయక్, మిద్దె సురేష్, రెహ్మాన్ తదితరులు పాల్గొన్నారు.