చూపులేని అమ్మాయి.. సవాల్‌తో కూడుకున్న పాత్ర
‘రమణీ కల్యాణం’ సినిమా మే 22న థియేటర్స్‌లోకి వస్తోంది. ఇది ఒక అద్భుతమైన కథ. ఇందులో చూపులేని అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. అది సవాల్‌తో కూడుకున్న పాత్ర. ఈ సినిమాలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది’ అని చెపుతోంది హీరోయిన్ దీప్షిక చంద్రన్. సూర్య వశిష్ట, దీప్షిక హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్ర మే రమణీ కల్యాణం. విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ ఎమోషనల్ డ్రా మాను కైట్స్ క్రియేటివ్స్ బ్యానర్‌పై విజయ్ ఆదిరెడ్డి, మనోజ్ చింతిరెడ్డి, శ్రీనాథ్ పసుపులేటి, సంజయ్ వెంపరాల నిర్మిస్తున్నారు.
కోర్ట్ మూవీ ఫేం రామ్ జగదీష్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం హైదరా బాద్‌లో జరిగింది. కథానాయకి దీప్షిక మాట్లాడుతూ.. ‘ఈ కథ విన్న తర్వాత నాకు కలిగిన ఎమోషన్, ఫస్ట్ కాపీ చూసిన తర్వాత కూడా అలాగే అనిపించింది. ఈ సినిమా ప్రతి ఒక్కరికీ ఒక నమ్మకాన్ని ఇ స్తుంది’ అని చెప్పారు. సహజ నటి జయసుధ టీజర్ లాంచ్ చేసి మాట్లాడుతూ.. ఈ మధ్యకాలంలో చిన్న సినిమాల్లో కూడా చాలా మంచి సినిమాలు వస్తున్నాయి. ‘రమణి కళ్యాణం’ కూడా అలాంటి మంచి సినిమా.






