08-02-2026 12:04:45 PM
ఆశీర్వదించండి ఆదరించండి కారు గుర్తు పై ఓటు వేసి గెలిపించండి
20 వ వార్డు బి ఆర్ ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి మాధవరావుపల్లె సునీల్ వాల్మీకి
వనపర్తి,(విజయక్రాంతి): వార్డు అభివృద్దే నా ఎజెండాగా పని చేస్తానని ఒక్కసారి ఆశీర్వదించండి ఆదరించండి కారు గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని 20 వ వార్డు బిఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి మాధవరావుపల్లె సునీల్ వాల్మీకి వార్డు ప్రజలను విజ్ఞప్తి చేశారు. శనివారం 20 వ వార్డులో స్థానిక బిఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం కార్యక్రమంను నిర్వహించారు.
ఈ సందర్బంగా 20వ వార్డు బిఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి మాధవరావుపల్లె సునీల్ వాల్మీకి మాట్లాడుతూ 10 ఏండ్ల క్రింద వనపర్తిను జిల్లా ఏర్పాటు చేసి పరిపాలన సౌలభ్యం కోసం 55 రకాల కార్యాలయాలను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హయాంలో ఏర్పాటు చేస్తే నిర్మాణాలు చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాను రద్దు చేస్తానంటున్నాడని జిల్లా రద్దు చేసే వాళ్లకు ఓట్లు వేయాలా అని అటువంటి కాంగ్రెస్ నాయకులకు తమ ఓటు తో తగిన బుద్ది చెబుతూ 20 వ వార్డులో ప్రజలు కారు గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజారిటీ తో నన్ను గెలిపించాలని 20 వ వార్డు బి ఆర్ ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి మాధవరావుపల్లె సునీల్ వాల్మీకి వార్డు ప్రజలను కోరారు.