నవజాత శిశు సంరక్షణపై ప్రత్యేక శిక్షణ
కార్యక్రమంలో పాల్గొన్న మెడికవర్ ఉమెన్ అండ్ చైల్ హాస్పిటల్స్ డాక్టర్లు, సిబ్బంది
హైదరాబాద్, మే 12 (విజయక్రాంతి): నవజాత శిశు మరణాల రేటును తగ్గించి, ప్రతి బిడ్డకు సురక్షితమైన జీవనారంభాన్ని అందించాలనే లక్ష్యంతో నేషనల్ నియోనాటాలజీ ఫోరం (ఎన్‌ఎన్‌ఎఫ్) దేశవ్యాప్తంగా నిర్వహించిన ఎన్‌ఆర్పీ(నియోనాటల్ రిససిటేషన్ ప్రోగ్రామ్)డేలో మెడికవర్ ఉమెన్ అండ్ చైల్ హాస్పిటల్స్ చురుగ్గా పాల్గొన్నాయి.
శిశువు జన్మించిన వెంటనే తలెత్తే శ్వాసకోశ ఇబ్బందులను అధిగమించేందుకు అవ సరమైన అత్యవసర నైపుణ్యాలపై (లైఫ్ సేవింగ్ స్కిల్స్) వైద్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందించారు. ఎన్‌ఎన్ ఎఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ లల్లన్ కుమార్ భారతి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 998 కేంద్రాల నుంచి సుమారు 20వేల మంది వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ బృహత్తర శిక్షణ కార్యక్రమం నవజాత శిశు సంరక్షణ రంగంలో ఒక మైలురాయిగా నిలిచింది. హైదరాబాద్‌లోని మెడికవర్ ఉమెన్ అండ్ చైల్ హాస్పిటల్స్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సీనియర్ నియోనే టల్ కేర్ స్పెష లిస్ట్ డాక్టర్ రవీందర్ రెడ్డి, కన్సల్టెంట్ నియోనాటాలజిస్ట్ డాక్టర్ నవిత నేతృత్వం వహిం చారు. డాక్టర్ రవీందర్ రెడ్డి అండ్ నియో నాటాలజిస్ట్, హెచ్‌వోడీ నియోనాటాలజీ అండ్ పీడియాట్రిక్స్ మా ట్లాడుతూ ‘శిశువు జన్మించిన తర్వాత మొ దటి నిమిషం (గోల్డెన్ మినిట్) అత్యంత కీలకమైంది.
ఆ సమయంలో శిశువు స్వయం గా శ్వాస తీసుకోలేకపోతే, సరైన వైద్య సహా యం అందించడం ద్వారా ప్రాణాపా యం నుంచి కాపాడవచ్చు. ఎన్‌ఆర్పీ శిక్షణ ద్వారా ప్రతి డెలివరీ సెంటర్‌లో నైపుణ్యం కలిగిన సిబ్బందిని సిద్ధం చేయడం మా లక్ష్యం’, అని వివ రించారు. డాక్టర్ నవిత - నియోనాటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్ మాట్లాడుతూ వైద్య సిబ్బందికి అధునాతన ప్రాణరక్షణ పద్ధతులపై అవగాహన కల్పించడం ద్వారా తల్లీబిడ్డల ఆరోగ్య రక్షణలో మెడికవర్ హాస్పిటల్స్ తన నిబద్ధతను చాటుకుంటోంది’, అని పేర్కొన్నారు.






