13 May, 2026 | 2:23 AM

10 లక్షల కోట్ల సంపద ఆవిరి

13-05-2026 01:19 AM
  1. స్టాక్ మార్కెట్ డమాల్
  2. భారీ నష్టాల్లో సూచీలు
  3. అంతర్జాతీయ మార్కెట్‌లో అనిశ్చితుల ప్రభావం
  4. రూపాయి విలువ పడిపోవడమూ కారణమే..

ముంబై, మే ౧౨: స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను చవిచూసింది. మంగళవారం ఒక్కరోజే మదుపర్ల సంపద 10 లక్షల కోట్లు ఆవిరైంది. మార్చి 30న సంభవించిన భారీ నష్టాల తర్వాత, మళ్లీ ఇంతగా స్టాక్ మార్కెట్ పడిపోవడం ఇదే మొదటిసారి. తాజాగా నిఫ్టీ 436 పాయింట్లు నష్టపోయి 2౩,౪౦౦ వద్ద ముగిసింది. సెన్సెక్స్ 1.92 శాతం మేర పతనమై 74,559.24 వద్ద స్థిరపడింది. మార్కెట్ ప్రారంభం నుంచే అమ్మకాల ఒత్తిడి షురూ అయింది. ఈ క్రమంలో ఒక్క ఉదుటన తమ వాటాలను విక్రయించారు.

అన్నిరంగాల కంటే ఐటీ రంగానికి ఈ పరిణామం పెద్దదెబ్బ. ఆ రంగం ఐటీ రంగం 3.73 శాతం మేర నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాతి స్థానాల్లో మీడియా, ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకింగ్ రంగాలు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి, విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లడం మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 95.72కు పడిపోవడం ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగించింది.