13 May, 2026 | 3:58 AM

‘శ్రీ శ్రీ హోలిస్టిక్’లో గుండె దడ సమస్యలకు చికిత్స

13-05-2026 12:20 AM

దేశంలోనే మొదటిసారిగా ‘పల్స్ ఫీల్ అబ్లేషన్’ సాంకేతికత ప్రారంభం

హైదరాబాద్, మే 12 (విజయక్రాంతి): గుండె సంబంధిత సమస్యల చికిత్సలో హైదరాబాద్‌లోని శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ సరికొత్త రికార్డు సృష్టించింది. గుండె కొట్టుకోవడం లో తేడాలు(హార్ట్ రిథమ్ డిజార్డర్స్) ఉన్నవారికి చికిత్స చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న అత్యంత ఆధునిక ‘పల్స్ ఫీల్ అబ్లేషన్’(పీఎఫ్‌ఏ) టెక్నాలజీని ఆసుపత్రిలో ప్రారంభించారు.

భారతదేశంలోనే మొదటిసారిగా ఈ అధునాతన టెక్నాలజీని తీసుకువచ్చిన ఆసుపత్రిగా శ్రీశ్రీ హో లిస్టిక్ హాస్పిటల్స్ నిలిచింది. ఈ కార్యక్రమం మంగళవారం శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్‌లో జరిగింది. కార్డియాలజీ విభాగం హెడ్ ప్రొఫెసర్ డాక్టర్ వీఎస్ రామచంద్ర, సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ బిజు గోవింద్, నిపుణులు డాక్టర్ భరణి వేలం, డాక్టర్ ప్రకాష్ నం జయ్య, వారి బృందం ఈ కొత్త టెక్నాలజీని ప్రజలకు పరిచయం చేశారు.

ఏమిటీ పల్స్ ఫీల్ అబ్లేషన్ (పీఎఫ్‌ఏ)?

సాధారణంగా గుండెలో విద్యుత్ ప్రవాహంలో లోపాల వల్ల గుండె కొట్టుకోవ డంలో వేగం పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది (దీనిని వైద్య పరిభాషలో అరిథ్మియా అంటారు). గతంలో దీనికి చేసే చికిత్సలో గుండెలోని కొన్ని భాగాలను వేడి చేయడం  లేదా గడ్డకట్టించడం ద్వారా సరిచేసేవారు. కానీ, ఈ కొత్త పీఎఫ్‌ఏ టెక్నాలజీ విద్యుత్ తరంగాల (ఎలక్ట్రిక్ పల్సెస్) ద్వారా కేవలం దెబ్బతిన్న కణాలను మాత్ర మే సరిచేస్తుంది.

రోగులకు కలిగే లాభాలు ఇవే:

అత్యంత సురక్షితం: ఈ పద్ధతిలో గుండె చుట్టూ ఉండే నరాలు, రక్తనాళాలు లేదా ఆహార వాహికకు ఎటువంటి హాని కలగదు, నొప్పి ఉండదు: ఇది సర్జరీ లాంటిది కాదు, కేవలం చిన్న రంధ్రం ద్వారా చేసే చికిత్స. కాబట్టి నొప్పి ఉండదు, వేగంగా కోలుకోవచ్చు: చికిత్స జరిగిన కొద్ది గంటల్లోనే లేదా అదే రోజున రోగి ఇంటికి వెళ్లవచ్చు, తక్కువ సమయం: పాత పద్ధతులతో పోలిస్తే ఈ చికి త్స చాలా తక్కువ సమయంలో పూర్తవుతుంది.

డాక్టర్ వీఎస్ రామచంద్ర (చైర్మన్, శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్) మాట్లాడుతూ ‘భారతదేశంలోనే మొదటిసారిగా ఈ పీఎఫ్‌ఏ టె క్నాలజీని మా ఆసుపత్రిలో ప్రారంభించడం గర్వంగా ఉంది. గుండె దడ సమస్యలతో బా ధపడే రోగులకు ఇది ఒక వరం లాంటిది. దీని ద్వారా మరింత సురక్షితంగా, ఖచ్చితత్వం తో చికిత్స అందించవచ్చు’. డాక్టర్ ప్రకాష్ నంజయ్య మాట్లాడుతూ ‘అమెరికా, యూర ప్ వంటి దేశాల్లో ఇప్పుడు ఈ టెక్నాలజీనే ఎక్కువగా వాడుతున్నారు. ఇప్పుడు అది మన శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్‌లో అందుబాటులోకి రావడం రోగులకు గొప్ప విషయం. ఈ టెక్నాలజీతో శ్రీశ్రీ హోలిస్టిక్ హా స్పిటల్స్ ఇప్పుడు గుండె దడ  సమస్యలకు దేశంలోనే అత్యుత్తమ చికిత్సా కేంద్రంగా మారింది.