ఆర్డీఎస్‌పై ప్రత్యేక దృష్టి
- నీటివాటా పూర్తి వినియోగానికి బహుముఖ వ్యూహం
- తక్షణ, దీర్ఘకాలిక పరిష్కారాలను అన్వేషించాలి
- కర్ణాటక, ఏపీ, కేంద్రంతో చర్చలకు ఏర్పాట్లు చేయండి
- డ్రెడ్జింగ్, కాలువ హెడ్ అభివృద్ధితో సహా అన్ని ప్రత్యామ్నాయాలపై సమగ్ర ప్రణాళిక ఇవ్వాలి
- మల్లమ్మకుంట 5 నుంచి 6 టీఎంసీలకు పెంపు..
- ఆర్డీఎస్ పరిస్థితి, తుంగభద్ర బోర్డు కార్యకలాపాలపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు
హైదరాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) కింద తెలంగాణకు కేటాయించిన నీటి వాటాను పూర్తిస్థాయిలో విని యోగించుకునేందుకు ప్రత్యేక దృష్టి సారించామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నా రు. తక్షణ, దీర్ఘకాలిక పరిష్కారాలను అన్వేషించాలని, కనీసం వచ్చే 15 నుంచి 20 సంవత్సరాల అవసరాలను తీర్చగల శాశ్వ త పరిష్కారాలపై దృష్టిసారించాలని అధికారులను ఆదేశించారు. తుంగభద్ర పరీ వాహక ప్రాంతంలో తెలంగాణ నీటి నిర్వహణను మెరుగుపరిచే దిశగా కర్ణాటక, ఏపీ, కేంద్రంతో చర్చలకు ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.
డ్రెడ్జింగ్, కాలు వ హెడ్ అభివృద్ధితో సహా అన్ని ప్రత్యామ్నాయాలపై సమగ్ర ప్రణాళిక అందజే యాలని ఆదేశించారు. అలాగే తుమ్మిళ్ల పురోగతిపైనా సీఎం సమీక్షించారు. మల్లమ్మకుంట నిల్వ సామర్థ్యాన్ని 5 నుంచి 6 టీఎంసీలకు పెంచాలని, అదనపు భూసేకరణనూ పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఆర్డీఎస్ పరిస్థితి, తుంగభద్ర బోర్డు కార్యకలాపాలపై బుధవారం సచివాలయంలో నిర్వహించిన ఉన్నతస్థా యి సమీక్షలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు.
ఆర్డీఎస్ కింద రాష్ట్రానికి సంవత్సరానికి దాదా పు 16 టీఎంసీల నీటి హక్కు ఉన్నప్పటికీ, ప్రస్తు తం కేవలం 5 నుంచి 6 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించుకో గలుగుతున్న ట్లు ఇంజనీర్లు వివరించారు. సిల్ట్ పేరుకుపోవడం, నిర్మాణ పరమైన అవరోధాలు, కాలువలో నీటి ప్రవాహానికి ఆటం కాలు ప్రధాన సమస్యలుగా మారాయని తెలిపారు. దశాబ్దాల నాటి ఆర్డీఎస్ వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలను సమగ్రంగా సీఎం సమీక్షించారు.
తెలంగాణకు కేటాయించిన నీటిని సమర్థవంతంగా విని యోగించుకునేందుకు అవసరమైన ఇంజినీరింగ్, పరిపాలన, అంతర్రాష్ట్ర సమన్వ య చర్యలపై చర్చించారు. తెలంగాణ ప్ర యోజనాలను కాపాడుతూ, తుంగభద్ర పరీవాహక ప్రాంతంలో నీటి నిర్వహణను మెరుగుపరిచే దిశగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వంతో చర్చల కు అవసరమైన ప్రాథమిక ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ఆర్డీఎస్ కాలువకు తగినంత నీరు చేరకపోవడానికి గల ప్రధాన కారణాలపై సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. కాలువ హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీగా సిల్ట్ పేరుకుపోవడం, నది ప్రవాహ మార్గంలో వచ్చిన మార్పులు, నిర్మాణాత్మక అవరోధాలు కాలువలోకి నీటి ప్రవాహాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని అధికారులు వివరించారు. ఆర్డీఎస్ వ్యవస్థకు కనీసం వచ్చే 15 నుంచి 20 సంవత్సరాల అవసరాలను తీర్చగల శాశ్వత పరిష్కారాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది.
2004లో నిపుణుల కమిటీ చేసిన పలు సిఫార్సులను కూడా పునఃసమీక్షించారు. కాలువ ప్రవేశద్వారం వద్ద పేరుకుపోయిన సిల్ట్ మట్టిని తొలగించడం, సరైన గ్రేడియెంట్లను పునరుద్ధరించడం, నీటి ప్రవాహాన్ని సజావుగా జరిగేలా చర్యలు చేపట్టడం, నది ప్రవాహాన్ని స్థిరీకరించేందుకు రివెట్మెంట్ పనులు చేపట్టడం వంటి అంశాలను కీలక సిఫార్సులుగా చర్చించారు. ఆర్డీఎస్ నీటి వనరుల్లో మళ్లీ సిల్టింగ్ జరగకుండా నివారించేందుకు నిపుణుల కమిటీ సూచించిన విధంగా రిటైనింగ్ వాల్ నిర్మాణం అవసరమని కూడా నిపుణులు అభిప్రాయపడ్డారు.
సాంకేతిక అంచనాల ప్రకారం.. కొన్ని పరిస్థితుల్లో నది ప్రవాహంలో గణనీయమైన భాగం ఆంధ్రప్రదేశ్ వైపు మళ్లిపోవడం వల్ల తెలంగాణ కాలువ హెడ్ వద్ద నీటి లభ్యత తగ్గుతోందని అధికారులు వివరించారు. తక్షణ చర్యగా డ్రెడ్జింగ్ (పూడిక తొలగింపు) చేపట్టడం అత్యంత ఆచరణ సాధ్యమైన పరిష్కారాలలో ఒకటిగా సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. కాలువ హెడ్ వద్ద పేరుకుపోయిన సిల్ట్‌ను శాస్త్రీయంగా తొలగించడం ద్వారా కీలక సాగు కాలాల్లో నీటి ప్రవాహాన్ని మెరుగుపరచవచ్చని ఇంజినీర్లు వివరించారు.
డ్రెడ్జింగ్, కాలువ హెడ్ అభివృద్ధి పనులు, ఆధునికీక రణ చర్యలు, ప్రత్యామ్నాయ ఎత్తిపోతల పథకాలు, అంతర్రాష్ట్ర సమన్వయ వ్యవస్థలు సహా అందుబాటులో ఉన్న అన్ని ప్రత్యామ్నాయాలపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆర్డీఎస్ ఆయకట్టుపై ఆధారపడిన రైతుల ప్రయోజనాల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.
కేవలం కాగితాలపై నీటి కేటాయింపులు ఉండటం సరిపోదని, కేటాయించిన నీరు రైతుల పొలాలకు చేరేలా చూడడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు, ఎపీ మల్లు రవి, ఏపీ ఎంపీ జితేందర్‌రెడ్డి, సీనియర్ ఇంజినీర్లు, జలవనరుల నిపుణులు, అధికారులు పాల్గొన్నారు.
రెండు దశల్లో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం
ఆర్డీఎస్ ఆయకట్టుకు సాగునీటి భద్రత కల్పించేందుకు ప్రత్యామ్నాయ వనరుగా చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పురోగతిని కూడా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్షించారు. మల్లమ్మకుంట రిజర్వాయర్ నిల్వ సామర్థ్యాన్ని 5 నుంచి 6 టీఎంసీలకు పెంచే అవకాశాలను, అవసరమైతే అదనపు భూసేకరణ చేపట్టే అంశాన్ని పరిశీలించాలని రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని రెండు దశల్లో అమలు చేయాలని ప్రణాళిక రూపొందించామన్నారు. మొదటి దశలో మూడు పంప్ హౌస్‌ల నిర్మాణం, రెండో దశలో మల్లమ్మకుంటతో సహా మూడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నిర్మాణం ద్వారా నీటి లభ్యతను పెంచి సాగునీటి స్థిరత్వాన్ని మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.






