25 June, 2026 | 3:01 AM

ఇటిక్యాల ఎంపీడీఓగా రమాదేవి బాధ్యతల స్వీకరణ

25-06-2026 01:51 AM

ఇటిక్యాల, జూన్ 24: ఇటిక్యాల మండల నూతన మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ)గా శ్రీమతి రమాదేవి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆమె ఇదే మండలంలో సూపరింటెండెంట్ (పర్యవేక్షకులు)గా విధులు నిర్వహించి, 2024 బదిలీల్లో భాగంగా గద్వాల్ ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లారు.

ఇటీవల ప్రభుత్వ పదోన్నతుల్లో భాగంగా ఆమెకు ఎంపీడీఓగా ప్రమోషన్ లభించడంతో తిరిగి ఇటిక్యాలకు కేటాయించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎంపీడీఓ రమాదేవి మాట్లాడుతూ.. మండల పరిషత్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది అందరూ సమన్వయంతో పనిచేసి మండల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ విధిగా సమయపాలన పాటించాలని, మండల ప్రగతికి ప్రజలు కూడా సహకరించాలని ఆమె కోరారు.