వర్షం రాదు.. నీళ్లు రావు
25-06-2026 02:05 AM
ఇటిక్యాల, జూన్ 24 : ఉమ్మడి ఇటిక్యాల మండలంలోని అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. పంట పొలాలలో కంది, పత్తి, మిరప, మొక్కజొన్న, తదితర విత్తనాలు నాటిన రైతులు వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. వర్షం రాకపోవడం, మండలంలో ప్రవహించే ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు (PJP) నీటి విడుదల కాకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజులు గడుస్తున్నా సాగునీరు లేకపోవడంతో తమ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని రైతులు ఆవేదన చెందుతున్నారు.






