ఎన్యుమరేషన్ ఫారం నింపడం ప్రతి ఒక్కరి బాధ్యత
జిల్లా అదనపు కలెక్టర్ హరి సింగ్
తుంగతుర్తి, జూన్ 24: బిఎల్‌ఓ ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫారం నింపడం ప్రతి ఒక్కరి బాధ్యతని, లేనియెడల ఓటును కోల్పోతారని జిల్లా అదనపు కలెక్టర్ హరి సింగ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ దయానంద్ అధ్యక్షతన వివిధ రాజకీయ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సర్ పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిజమైన ఓటు హక్కును కల్పించే లక్ష్యంతో, గ్రామాలు పట్టణాల్లో ప్రతి ఇంటికి ఎన్యుమరేషన్ ఫారంను బిఎల్వోలు తీసుకు రావడం జరుగుతుందని, ఓటు హక్కు కలిగిన వారు ప్రతి ఒక్కరూ, ఈ ఫారం నిబం ధనకు లోబడి, పూర్తిస్థాయిలో పూరిం చి, అ ధికారులకు సహకరించాలని కోరారు. సమావేశంలో పాల్గొన్న రాజకీయ నాయకులు సర్ పై ప్రత్యేకంగా తెలియపరచవలసిన ఆవశ్యకత ఉందని, వీరికి పూర్తిస్థాయిలమ్మ అ ర్థంకుటకు ఆడియో వీడియో రూపం కం ప్యూటర్లో ప్రదర్శించి తెలిపారు.
ఓట్లు తీసివేస్తారని, ఏదో జరుగుతుందని అపోహలో ఉన్నారని, ఇది నిజం కాదని, 2002 సెన్సెస్ ప్రకారము, ఓటు కలిగిన ప్రతి ఒక్కరూ, నిజమైన ఓటు పొందాలని, లక్ష్యముతో, కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం, దీన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలని కోరారు. సర్ మ్యాపింగ్ చేసిన వారు కూడా, ఫారం నింపే అవకాశం ఉన్నది. గురువారం నుండి ఈ కార్యక్రమం గ్రామాల్లో కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఎల్వోలు ,బిఎల్‌ఎలు, రెవెన్యూ అధికారులు సిబ్బంది వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.






