ఎమ్మెల్యేలు దానం, కడియంకు స్పీకర్ క్లీన్ చిట్
దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
అనర్హత పిటిషన్ల డిస్మిస్ చేసిన స్పీకర్
మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చీట్
రేపు సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ
హైదరాబాద్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Khairatabad MLA Danam Nagender), స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్లను తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్(Telangana Speaker Gaddam Prasad) కుమార్ బుధవారం కొట్టేశారు. ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఆధారాలు లేవని స్పీకర్ వెల్లడించారు. రేపు సుప్రీంకోర్టులో విచారణ ఉండడంతో స్పీకర్ ఇవాళ నిర్ణయం ప్రకటించారు. ఇప్పటికే పార్టీ మారిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ ప్రసాద్ క్లీన్ చీట్ ఇచ్చారు.
అటు ఎమ్మెల్యే దానం నాగేందర్(MLA Danam Nagender) కీలక వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ పరిధిలో తాను ఎలాంటి తప్పు చేయలేదని, పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) తనను వివరణ అడగలేదని తెలిపారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ కూడా వివరణ అడగలేదన్నారు. తనపై పిటిషన్ వేసిన వాళ్లకు ఏం అధికారం ఉందని మండిపడ్డారు. తనకు ఎప్పుడూ విప్ జారీ చేయలేదన్న దానం బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా తాను పనిచేయలేదని వివరించారు. అనర్హత పిటిషన్లపై స్పీకర్ ప్రసాద్ నిర్ణయంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి(BRS MLA Kaushik Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దుర్మార్గమైన నిర్ణయం అన్నారు. ఆధారాలు కనిపిస్తున్నా అనర్హత పిటిషన్లు కొట్టివేశారని ఆరోపించారు.




