calender_icon.png 14 February, 2026 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ అప్రజాస్వామిక పాలనకు చెంపపెట్టు

14-02-2026 12:37:31 AM

  1. బీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపును అడ్డుకోలేకపోయారు
  2. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): సీఎం, మంత్రులు సహాయావత్ ప్రభుత్వ యంత్రాంగం ఒక్కటై కొట్లాడినా మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపును అడ్డుకోలేకపోయారని, ఇది కాం గ్రెస్ ప్రజా వ్యతిరేక పాలనకు నిలువుటద్దమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. అధికార దుర్వినియోగం, డబ్బు రాజకీయా లు, బెదిరింపులు అన్నింటినీ తట్టుకుని గెలిచిన బీఆర్‌ఎస్ అభ్యర్థుల విజయం కాంగ్రెస్ అప్రజాస్వామిక పాలనకు చెంపపెట్టు అని అన్నారు.

మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై హరీశ్‌రావు స్పందిస్తూ... అధికార కాంగ్రెస్ అక్రమాలు, దౌర్జన్యాలకు ఎదురొడ్డి కార్పొరేటర్లు, కౌన్సిలర్లుగా గెలిచి సత్తాచాటిన బీఆర్ ఎస్ నాయకులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్  అప్రజాస్వామిక విధానాల కు తగిన రీతి లో బుద్ధి చెబుతూ, పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన గులాబీ నాయకులు, కష్టపడిన కార్యకర్తలు, సోషల్ మీ డియా సైనికులందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.

దాదా పు 700 పైగా వార్డుల్లో బీఆర్‌ఎస్ గెలుపు సాధించడం యాదృచ్ఛికం కాదని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వంపై రో జురో జుకూ పెరుగుతున్న  వ్యతిరే కతకు నిలువెత్తు నిదర్శనమని పే ర్కొన్నారు. కాంగ్రెస్‌ను గద్దె దించే శక్తి ఒక్క బీఆర్‌ఎస్‌కు మాత్రమే ఉందని, భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేది బీఆర్‌ఎస్ పార్టీనే అని మొన్న పంచాయతీ ఫలితాలు, నేడు మున్సిపల్ ఫలితాలు కుండబద్దలు కొట్టి చెప్పాయని తెలిపారు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ  వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంటామని హెచ్చరించారు.