22 May, 2026 | 12:47 AM

తమిళనాడు మంత్రివర్గ విస్తరణ

22-05-2026 12:04 AM
  1. క్యాబినెట్‌లోకి మరో 23 మంది మంత్రులు
  2. ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ అర్లేకర్
  3. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరికి చోటు
  4.   59 ఏళ్ల తర్వాత ఆ పార్టీకి తొలిసారి అవకాశం
  5. మొత్తంగా 32 మంది మంత్రులతో క్యాబినెట్.. వీరిలో నలుగురు మహిళలు

చెన్నై, మే ౨౧: తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ గురువారం తన మంత్రివర్గాన్ని విస్తరించారు. గురువారం కొత్తగా 23 మంది మంత్రులను క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. చెన్నైలోని లోక్‌భవన్‌లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. వీరిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎస్.రాజేశ్‌కుమార్ పర్యాటక శాఖ మంత్రిగా, పీ విశ్వనాథన్ ఉన్నత విద్యాశాఖ మంత్రిగా ప్రమాణం చేశారు.

59 ఏళ్ల తర్వాత రాష్ట్ర మంత్రివర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులుగా కొలువుదీరడం ఇదే తొలిసారి. అలాగే క్యాబినెట్‌లో నలుగురు మహిళలు మంత్రులుగా కొలువుదీరారు. ఎస్సీ సామాజికవర్గం నుంచి ముగ్గురు మంత్రి పదవులు దక్కించుకున్నారు. ఇప్పటికే తొమ్మిది మంది మంత్రులతో కలిసి ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. దీంతో మొత్తంగా రాష్ట్ర క్యాబినెట్‌లో 32 మంది మంత్రులు కొలువుదీరినట్లయింది.

మంత్రివర్గ విస్తరణ తర్వాత సీఎం కొత్త మంత్రులకు శాఖలను కేటాయించారు. గతంలో కొందరికి అప్పగించిన కొన్ని శాఖలను సైతం మార్పులు చేశా రు. గతంలో కేఏ సెంగోట్టయ్యన్‌కు కేటాయించిన ఆర్థిక శాఖను మేరీ విల్సన్‌కు అప్పగించారు. సెంగోట్టయ్యన్ రెవెన్యూ శాఖ అప్పగించారు. హోం, జనరల్ అడ్మినిస్ట్రేషన్, నీటిసరఫరాతోపాటు పలు శాఖల ను తన వద్దే ఉంచుకున్నారు. అలాగే, ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లు గానే మహి ళల భద్రతా విభాగాన్ని పర్యవేక్షించే బాధ్యతలనూ తానే తీసుకుంటారని సమాచారం.

నలుగురు మహిళా మంత్రులు

టీవీకే ప్రభుత్వంలో నలుగురు మహిళా మంత్రులు కొలువుదీరారు. ఎస్.కీర్తన - పరిశ్రమల శాఖ మంత్రిగా, ఎస్.కమలి పశు సంవర్ధకశాఖ మంత్రిగా, సి.విజయలక్ష్మి పాడి పరిశ్రమశాఖ మంత్రిగా, కె.జగదీశ్వరి సాంఘిక సంక్షేమం, మహిళా సాధికారత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఎస్సీ సామాజికవర్గం నుంచి ముగ్గురు మంత్రులు

ఎస్సీ సామాజికవర్గం నుంచి ఆధవ్ అర్జున పబ్లిక్ వర్క్స్, క్రీడల శాఖ మంత్రిగా, డాక్టర్ కేజీ అరుణ్‌రాజ్ -వైద్యారోగ్య, విద్యాశాఖ ఎ.రాజమోహన్ పాఠశాల విద్య, తమిళ భాషాభివృద్ధి శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.

త్వరలో మిత్రపక్షాల నుంచీ కొందరికి..

టీవీకే ప్రభుత్వంలో ప్రస్తుతం ఆ పార్టీ ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్ నుంచి ఇద్దరికి మంత్రిపదవులు దక్కాయి. అయితే.. ప్రభుత్వంలో చేరేందుకు సిద్ధంగా ఉన్న మిత్రపక్షాలు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐఎంఎల్), వీసీకే సంగతేంటనే ప్రశ్న మొదలైంది. ఐఎంఎల్ ఎమ్మెల్యే షాజహాన్‌కు మంత్రిగా సీఎం అవకాశం ఇవ్వబోతున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే, వీసీకే ఎమ్మెల్యే వన్ని అరసుకు కూడా మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తున్నది.

మరోవైపు, సీపీఐ, సీపీఎం మాత్రం ప్రభుత్వంలో చేరేందుకు ససేమిరా అంటున్నాయి. తమ ఎమ్మెల్యేలు బయటి నుంచి మద్దతు ఇస్తారని కుండబద్దలు కొట్టాయి. మొత్తంగా మిత్రపక్షాలన్నీ ఒక హుకుం జారీ చేశాయి. అదేంటంటే.. మంత్రి వర్గంలోకి ఎట్టిపరిస్థితుల్లోనూ ఏఐఏడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలను తీసుకోకూడదు. ఒకవేళ వారిని మంత్రివర్గంలోకి చేర్చుకుంటే తమ మద్దతును వాపస్ తీసుకుంటామని తేల్చిచెప్పాయి. అందుకు టీవీకే కూడా అంగీకరించినట్లు తెలిసింది.

ప్రమాణ స్వీకారంలో రాహుల్ పేరు.. తప్పును సరిదిద్దుకున్న మంత్రి

కాంగ్రెస్ నుం చి మంత్రి పదవి దక్కించుకున్న ఎస్.రాజేష్ కుమా ర్ మంత్రిగా ప్ర మాణ స్వీకారం చేస్తూ మధ్యలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ పేరును రాజీవ్‌గాంధీ ఉటంకించారు. రాజీవ్‌గాంధీ, కామరాజ్ నాడార్‌ను ప్రస్తావించారు. అం దుకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘మీ ప్రమాణ స్వీకారంలో ఆ పేరు భాగం కాదు’ అంటూ చిరునవ్వుతో నే వారించారు. దీంతో మంత్రి అప్రమత్తమై ప్రసంగాన్ని సవరించుకున్నా రు. గవర్నర్ సూచన ప్రకారం ప్రమా ణ స్వీకారం చేసి మంత్రిగా కొలువుదీరారు.