21 May, 2026 | 6:07 PM

తడగొండలో ఘనంగా రాజీవ్ గాంధీ 35 వ వర్ధంతి వేడుకలు

21-05-2026 05:07 PM

అనంతరం కూలీలకు మజ్జిగ, పండ్ల పంపిణీ

మండల అధ్యక్షులు కొమ్మనబోయిన సువీన్ యాదవ్

బోయినపల్లి: మే 21(విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం తడగొండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి దివంగత రాజీవ్ గాంధీ గారిని స్మరిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్మనబోయిన సువీన్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తొలుత గ్రామంలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సువీన్ యాదవ్ మాట్లాడుతూ.. భారతదేశాన్ని సాంకేతిక రంగంలో ప్రపంచ దేశాల సరసన నిలబెట్టిన ఘనత రాజీవ్ గాంధీ గారికే దక్కుతుందని ఆయన కీర్తిని కొనియాడారు. దేశాభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి, త్యాగాలు వెలకట్టలేనివని, ఆయన ఆశయ సాధన  అనంతరం ఉపాధి హామీ పథకంలో భాగంగా మండుటెండలో పనులు నిర్వహిస్తున్న కూలీల వద్దకు నాయకులు వెళ్లారు. ఎండ తీవ్రత దృష్ట్యా కూలీల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి మజ్జిగ, పండ్లు పంపిణీ చేశారు. ఈ చిన్న సహాయం కూలీలకు ఎంతో ఊరటనిచ్చింది.

సామాన్యుల కష్టసుఖాల్లో పాలుపంచుకోవడమే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమని సువీన్ యాదవ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో  స్థానిక సర్పంచ్ ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్, ఏ ఎం సీ ఛైర్మెన్ బోయిని ఎల్లేష్ యాదవ్ , వైస్ ఛైర్మెన్ వినోద్ రెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టేపల్లి సుధాకర్, సర్పంచులు నల్ల మోహన్, జంగం అంజయ్య, డైరెక్టర్ బొంగోని వెంకటేష్, అద్దంకి రమేష్, శేఖర్ రెడ్డి, స్థానిక కాంగ్రెస్ నాయకులు గుడి శ్రీనివాస్ రెడ్డి, ఎండి హుస్సేన్, మండల శ్రీను, ముచ్చ శేఖర్ రెడ్డి, బాబు, అనుపట్ల తిరుపతి రెడ్డి, జాగిరి శోభన్, జంగ సత్యం, నాగుల వంశీ,చేపూరి వెంకటేష్,దయ్యాల రాజశేఖర్, కొలుపుల ప్రవీణ్, మందల వరుణ్, మందల వంశీ, జాగిరి వెంకటేష్, కేశవ రెడ్డి, మండల నరేష్, దూస రాజశేఖర్, ప్రజా ప్రతినిధులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.